Friday, August 3, 2012

ఉరకలై గోదావరీ ఉరికె నా ఒడిలోనికీ

చిత్రం: అభిలాష (1983) 
సంగీతం: ఇళయరాజా 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: బాలు, జానకి 

పల్లవి: 

ఉరకలై గోదావరీ ఉరికె నా ఒడిలోనికీ 
సొగసులై బృందావనీ విరిసె నా సిగలోనికీ 
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ 
చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ 
రసమయం జగతీ 
ఉరకలై గోదావరీ ఉరికె నా ఒడిలోనికీ 

చరణం 1: 

నీ ప్రణయ భావం నా జీవరాగం 
నీ ప్రణయ భావం నా జీవరాగం 
రాగాలూ తెలిపే భావాలూ నిజమైనవీ 
లోకాలూ మురిసే స్నేహాలు ఋజువైనవీ 
అనురాగ రాగాలా స్వరలోకమే మనదైనదీ 

ఉరకలై గోదావరీ ఉరికె నా ఒడిలోనికీ 
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ 
చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ 
రసమయం జగతీ 

చరణం 2: 

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం 
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం 
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనదీ 
నీవన్న మనిషే ఈనాడూ నాదైనదీ 
ఒక గుండె అభిలాషా పదిమందికీ బ్రతుకైనదీ 

ఉరకలై గోదావరీ ఉరికె నా ఒడిలోనికీ 
సొగసులై బృందావనీ విరిసె నా సిగలోనికీ 
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ 
చిగురాకు చరణాలకీ సిరిమువ్వ రవళీ 
రసమయం జగతీ

No comments:

Post a Comment