Friday, August 3, 2012

నీ ఆట నా పాట

చిత్రం: అనురాగ దేవత (1982)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు


పల్లవి:

నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా
నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా
చిరునవ్వుకు ముద్దంటా.. సిగ పువ్వుకు ముద్దంట
సిరిమువ్వగా నేనుంటా.. సిరిమువ్వగా నేనుంటా....
నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా

చరణం 1:

అందాలు నీలోన పందాలు వేస్తుంటే
అరచేత పగడాలు జగడాలు పడుతుంటే...ఏ...
అందాలు నీలోన పందాలు వేస్తుంటే
అరచేత పగడాలు జగడాలు పడుతుంటే....

యద మీద హారాలు తారాడుతుంటే
తారళ్ళు నీ కంట తానాలు చేస్తుంటే
తెలుగు పాటక ఓ ఎంకివై.. తెలుగు తోట విరికంకివై
కిన్నెర మీటే నవ్వులతో.. కిన్నెర మీటే నవ్వులతో ...
కిన్నెరసాని నడకలతో.. కిన్నెరసాని నడకలతో....

నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా
చిరునవ్వుకు ముద్దంటా.. సిగ పువ్వుకు ముద్దంట
సిరిమువ్వగా నేనుంటా.. సిరిమువ్వగా నేనుంటా....
నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా

చరణం 2:

జడకుప్పె నీ మొగ్గ నడుమెక్కడ అంటుంటే..అహా..
పెదవులు నీ పుట్టు గోరింటలవుతుంటే....
జడకుప్పె నీ మొగ్గ నడుమెక్కడ అంటుంటే..
పెదవులు నీ పుట్టు గోరింటలవుతుంటే
మా ఇంటి దీపాలు నీ రూపమవుతుంటే
నీ కంటి నీడల్లో నే రాగమవుతుంటే...

కూచిపూడికి ఒక ఆటావై
కూనలమ్మ తొలి తెలుగు పాటవై
జాబిలి దాటే వెన్నెలతో.. జాబిలి దాటే వెన్నెలతో..
జాబులు పంపే కన్నులతో.. జాబులు పంపే కన్నులతో....

నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా
నీ ఆట నా పాట.. పది మంది చూడాలి ఈ పూటా
చిరునవ్వుకు ముద్దంటా.. సిగ పువ్వుకు ముద్దంట
సిరిమువ్వగా నేనుంటా.. సిరిమువ్వగా నేనుంటా....

No comments:

Post a Comment