Sunday, August 26, 2012

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు

చిత్రం: ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దేవులపల్లి
నేపథ్య గానం: సుశీల


పల్లవి:


ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు ..పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు .....
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు.. పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు...
ఎంత తొందరలే హరి పూజకు ...ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ .....
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు... పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు..


చరణం 1:


కొలువైతివా దేవి నాకోసము...కొలువైతివా దేవి నాకోసము..
తులసీ ..... తులసీ దయాపూర్ణకలశీ...
కొలువైతివా దేవి నాకోసము..తులసీ....తులసీ దయాపూర్ణకలశీ...
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి ..... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి .....
మొల్లలివి ...నన్నేలు నా స్వామికి...


ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు... పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
ఎంత తొందరలే హరి పూజకు... ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ ...


చరణం 2:


ఏ లీల సేవింతు.. ఏమనుచు కీర్తింతు...
ఏ లీల సేవింతు.. ఏమనుచు కీర్తింతు
సీత మనసే నీకు సింహాసనం...
ఒక పువ్వు పాదాల....ఒక దివ్వె నీ మ్రోల....
ఒక పువ్వు పాదాల...ఒక దివ్వె నీ మ్రోల
ఒదిగి నీ ఎదుట ఇదే వందనం .....
ఇదే వందనం .....


ఉం..ఉమ్మ్..ఉమ్మ్..ఉమ్మ్...ఉమ్మ్....ఉమ్మ్...ఉమ్మ్...



No comments:

Post a Comment