Sunday, August 26, 2012

ఇచ్చేశా నా హృదయం తీసుకో

చిత్రం: ఈతరం మనిషి (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

ఇచ్చేశా నా హృదయం తీసుకో..
ఎద లోపల పదిలంగా దాచుకో..
అద్దంలా చూసుకో... ముద్దల్లే వాడుకో..

ఇచ్చేశా నా హృదయం తీసుకో..
ఎదలోపల పదిలంగా దాచుకో..
అద్దంలా చూసుకో... ముద్దల్లే వాడుకో..
ఇచ్చేశా నా హృదయం తీసుకో..
ఎద లోపల పదిలంగా దాచుకో..

చరణం 1:

చిగురువంటి చినదానికి చెంపలే సొంపులు
చిలిపికళ్ళ చినవాడితో చెలిమిలోన ఇంపులు
చేసుకునే బాసలు
ఊ ఊ ఊ ఊ ..
చెరిగిపోనీ రాతలు
చేసుకునే బాసలు.. చెరిగిపోనీ రాతలు
చెప్పలేని ఊహలు చెయబోవు చేతలు
అహా... హా హా హా ..లా..లా..లా
ఇచ్చేశా నా హృదయం తీసుకో..
ఎద లోపల పదిలంగా దాచుకో..

చరణం 2:

నిన్ను నన్ను కలిపిన ఈ కన్నులు
అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలు

నిన్ను నన్ను కలిపిన ఈ కన్నులు
అవి ఎన్నటికీ కాస్తాయి వెన్నెలలు


మన కౌగిలి పందిరిలో మల్లెలు
మన కౌగిలి పందిరిలో మల్లెలు

దినదినమూ చల్లుతాయి మరపురాని మమతలు...
ఇచ్చేశా నా హృదయం తీసుకో..
ఎద లోపల పదిలంగా దాచుకో..

చరణం 3:

మన మధ్యన గాలికూడ ఉండనే ఉండదు
మనమంటే కాలమైనా పరుగిడనే పరుగిడదు

నువ్వు నా ఊపిరి
నేను నీ లాహిరి

నువ్వు నా ఊపిరి
నేను నీ లాహిరి

ఇద్దరమూ చూద్దాము ఆనంద హిమగిరి
అహా.. హా హా హా.... లా లా లా

ఇచ్చేశా నా హృదయం తీసుకో..
నీ ఎద లోపల పదిలంగా దాచుకో..
అద్దంలా చూసుకో... ముద్దల్లే వాడుకో..
ఇచ్చేశా నా హృదయం తీసుకో..
ఎద లోపల పదిలంగా దాచుకో..

No comments:

Post a Comment