Thursday, August 16, 2012

నేనొక ప్రేమ పిపాసిని

చిత్రం: ఇంద్ర ధనుస్సు (1978)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపథ్య  గానం: బాలు



పల్లవి:



నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి

నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది


నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి

నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది

నేనొక ప్రేమ పిపాసిని....



చరణం 1:



తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా

పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా

తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా

పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా




నా దాహం తీరనిది నీ హృదయం కరగనిది

నేనొక ప్రేమ పిపాసిని...



చరణం 2 :



పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను

ప్రేమ భిక్షనూ పెట్టగలవని దోసిలి ఒగ్గాను

నీ అడుగులకు మడుగులోత్తగా ఎడదను పరిచాను

నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను


నేనొక ప్రేమ పిపాసిని…



చరణం 3 :


పగటికి రేయి .. రేయికి పగలు.. పలికే వీడ్కోలు

సెగ రేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలునని

నీ జ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావు

నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను



నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి

నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది

నేనొక ప్రేమ పిపాసిని....


3 comments:

  1. Very nice song,
    Keep it up..
    Lyrics telugulo super andi.
    Mee kastam, adhiruchi thelusthondhi

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. చిన్న సవరణ
    "తలుపు మూసిన తలవాకిటిలో" వున్న చోట "తలుపు మూసిన తలవాకిటనే" అని వుండాలి. గమనించ ప్రార్థన


    ReplyDelete