Wednesday, August 8, 2012

పిలిచిన మురళికి వలచిన మువ్వకి

చిత్రం: ఆనంద భైరవి (1984) 
సంగీతం: రమేశ్ నాయుడు 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: బాలు, జానకి 

పల్లవి: 

పిలిచిన మురళికి వలచిన మువ్వకి 
ఎదలో ఒకటే రాగం అది ఆనందబైరవి రాగం 

మురసిన మురళికి మెరిసిన మువ్వకి 
ఎదలో ప్రేమపరాగం మది ఆనందభైరవి రాగం 

చరణం 1: 

కులికే మువ్వల అలికిడి వింటే.. కళలే నిద్దురలేచే 
కులికే మువ్వల అలికిడి వింటే.. కళలే నిద్దురలేచే 

మనసే మురళీ ఆలాపనలో.. మధురానగరిగ తోచే 
యమునా నదిలా పొంగినదీ.. స్వరమే వరమై సంగమమై 

మురసిన మురళికి.. మెరిసిన మువ్వకి 
ఎదలో ప్రేమపరాగం.. మది ఆనందభైరవి రాగం 

పిలిచిన మురళికి.. వలచిన మువ్వకి 
ఎదలో ఒకటే రాగం.. అది ఆనందబైరవి రాగం 

చరణం 2: 

ఎవరీ గోపిక పదలయ వింటే.. ఎదలో అందియ మ్రోగే 
ఎవరీ గోపిక పదలయ వింటే.. ఎదలో అందియ మ్రోగే 
పదమే పదమై మదిలో వుంటే.. ప్రణయాలాపన సాగే 
హృదయం లయమై పోయినదీ.. లయలే ప్రియమై జీవితమై.. 

మురసిన మురళికి.. మెరిసిన మువ్వకి 
ఎదలో ప్రేమపరాగం.. మది ఆనందభైరవి రాగం 

పిలిచిన మురళికి.. వలచిన మువ్వకి 
ఎదలో ఒకటే రాగం.. అది ఆనందబైరవి రాగం

No comments:

Post a Comment