Tuesday, August 7, 2012

అల్లో మల్లో ఆకాశంలో

చిత్రం: ఆత్మీయుడు (1977) 
సంగీతం: జె.వి. రాఘవులు 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: బాలు, సుశీల 

పల్లవి: 

అల్లో మల్లో..ఓ.. ఆకాశంలో..ఓ.. చల్లని వెన్నెల్లో.. 
ఆశలెన్నో.. ఊసులెన్నో అల్లరి కన్నుల్లో.. నీ అల్లరి కన్నుల్లో.. 

అల్లో మల్లో..ఓ.. ఆకాశంలో..ఓ.. చల్లని వెన్నెల్లో.. 
ఆకలెంతో.. దూకుడెంతో.. పోకిరి కన్నుల్లో.. నీ పోకిరి కన్నుల్లో.. 

చరణం 1: 

ఎర్రని సిగ్గు ఎగబాకింది నున్నని బుగ్గల్లో.. 
చిలిపి కోరికా చెడుగుడాడినది జిలిబిలి చూపుల్లో..ఓ.. 
ఎర్రని సిగ్గు ఎగబాకింది నున్నని బుగ్గల్లో.. 
చిలిపి కోరికా చెడుగుడాడినది జిలిబిలి చూపుల్లో.. 

దోబూచాడే నవ్వుల్లో.. తొందర తెలిపే పెదవుల్లో.. 
దోబూచాడే నవ్వుల్లో.. తొందర తెలిపే పెదవుల్లో.. 
తొణుకుతున్నది తొలకరి వలపు.. ముద్దుల ముడుపుల్లో..ఓ..ఓ.. 

అల్లోమల్లో..ఓ.. ఆకాశంలో..ఓ.. చల్లని వెన్నెల్లో.. 
ఆశలెన్నో.. ఊసులెన్నో అల్లరి కన్నుల్లో.. నీ అల్లరి కన్నుల్లో.. 

చరణం 2: 

తొలి హాయి చూడాలి.. తొలి రేయిలో.. 
తొలి ముద్ర వెయ్యాలి.. తొలి ముద్దులో.. 
తొలి హాయి చూడాలి.. తొలి రేయిలో.. 
తొలి ముద్ర వెయ్యాలి.. తొలి ముద్దులో.. 

మరుపొద్దు పొడవాలి.. నీ మోములో..ఓ.. 
మరుపొద్దు పొడవాలి.. నీ మోములో..ఓ.. 
మైమరచిపోవాలి.. ఆ గోములో.. ఆ గోములో.. 

అల్లోమల్లో..ఓ.. ఆకాశంలో..ఓ.. చల్లని వెన్నెల్లో.. 
ఆకలెంతో.. దూకుడెంతో.. పోకిరి కన్నుల్లో.. నీ పోకిరి కన్నుల్లో.. 

చరణం 3: 

విరబుయ్యాలి మోజుల జాజులు.. వెచ్చని కౌగిళ్ళో... 
ఆ వెచ్చదనాలు వెంటపడాలి.. ఒంటరి వేళల్లో..ఓ.. 
విరబుయ్యాలి మోజుల జాజులు.. వెచ్చని కౌగిళ్ళో... 
ఆ వెచ్చదనాలు వెంటపడాలి.. ఒంటరి వేళల్లో.. 

నలిగిన పువ్వుల గుసగుసలో.. నాలుగు కన్నుల అలసటలో.. 
నలిగిన పువ్వుల గుసగుసలో.. నాలుగు కన్నుల అలసటలో.. 
ఇద్దరి ఒద్దిగ కనిపించాలి...పొద్దుటి వెలుగుల్లో...ఓ.. 

అల్లో మల్లో..ఓ.. ఆకాశంలో..ఓ.. చల్లని వెన్నెల్లో.. 
ఆశలెన్నో.. ఊసులెన్నో.. అల్లరి కన్నుల్లో.. 
ఆకలెంతో.. దూకుడెంతో.. పోకిరి కన్నుల్లో.. 
నీ అల్లరి కన్నుల్లో.. 
నీ పోకిరి కన్నుల్లో..

No comments:

Post a Comment