Thursday, August 9, 2012

వీణ వేణువైన సరిగమ విన్నావా

చిత్రం: ఇంటింటి రామాయణం (1979)

సంగీతం: రాజన్-నాగేంద్ర

గీతరచయిత: వేటూరి

నేపథ్య గానం: బాలు, జానకిపల్లవి :


వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా

తనువు తహతహలాడాల చెలరేగాల

చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో...


వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావాచరణం 1 :


ఊపిరి తగిలిన వేళ.. నే వంపులు తిరిగిన వేళ

నా వీణలో నీ వేణువే పలికే రాగమాలా

ఆ...ఆ.. లాలలా... ఆ...

చూపులు రగిలిన వేళ…  ఆ చుక్కలు వెలిగిన వేళ

నా తనువునా అణువణువునా జరిగే రాసలీలా ..వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావాచరణం 2 :


ఎదలో అందం ఎదుటా.. ఎదుటే వలచిన వనితా

నీ రాకతో నా తోటలో  వెలసే వనదేవతా


ఆ... ఆ.. లాలలా... ఆ...

కదిలే అందం కవితా... అది కౌగిలికొస్తే యువతా

నా పాటలో నీ పల్లవే... నవతా నవ్య మమతావీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా

తనువు తహతహలాడాల... చెలరేగాల

చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో...


వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా


ఓ.. లాలలాలాలాలలలల

ఓ... ఓ.. లాలలాలాలాలలలల
No comments:

Post a Comment