Monday, August 27, 2012

తోటలో నా రాజు

చిత్రం: ఏకవీర (1969)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: సినారె
నేపథ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
తోటలో నా రాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు

చరణం 1:

నవ్వులా అవి.. కావు
నవ్వులా అవి కావు... నవ పారిజాతాలు
నవ్వులా అవి కావు.. నవ పారిజాతాలు
రవ్వంత సడిలేని.. రసరమ్య గీతాలు
రవ్వంత సడిలేని.. రసరమ్య గీతాలు
ఆ రాజు ఈ రోజు అరుదెంచునా
ఆ రాజు ఈ రోజు అరుదెంచునా
అపరంజి కలలన్నీ చిగురించునా

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు

చరణం 2:

చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను
చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను
పాటలాధర రాగ భావనలు కన్నాను
చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను
పాటలాధర రాగ భావనలు కన్నాను

ఎలనాగ నయనాల కమలాలలో దాగి
ఎలనాగ నయనాల కమలాలలో దాగి
ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను
ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను
ఆ పాట నాలో తియ్యగ మ్రోగనీ
ఆ పాట నాలో తియ్యగ మ్రోగనీ
అనురాగ మధుధారయై సాగనీ
ఊఁహూఁహుఁ.. ఊఁహూఁహుఁ.. ఉఁహుఁహుఁ.... ఊఁహూఁహుఁ..

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. పాటలా ధర రాగ కాదండి
    పాటలాధర రాగ
    పాటల వర్ణము అంటే తాంబూలం తింటే వచ్చే ఎరుపు రంగు

    ReplyDelete