Thursday, August 16, 2012

నీ మనసు నా మనసు ఏకమై


చిత్రం :  ఇదా లోకం (1973)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల


పల్లవి :


నీ మనసు నా మనసు ఏకమై
నీ నీడ అనురాగ లోకమై
ప్రతి జన్మలోన జతగానే ఉందాములే..ఏ ఏ ఏ
ఓ ఓ ఓ..హో..
ఆ ఆ ఆ నీ మనసు నా మనసు ఏకమై ఈ ఈ....


చరణం 1 :


చలిగాలి తొలిమబ్బు పులకించి కలిసే
మనసైన చిరుజల్లు మనపైన కురిసే


దూరాన గగనాల తీరాలు మెరిసే
మదిలోన శతకోటి ఉదయాలు విరిసే


ఆ..ఆ..పరువాల బంగారు కిరణాలలో
ఆ..ఆ..కిరణాల జలతారు కెరటాలలో
నీవే నేనై ఉందాములే..
ఆ ఆ..ఓ ఓ..ఆ ఆ ఆ ఆ...


నీ మనసు నా మనసు ఏకమై...


చరణం 2 :


ఆ..ఆ...ఏనోములో నిను నా చెంత నిలిపే
ఏ దైవమో నేడు నిను నన్ను కలిపే


నీ పొందులో ప్రేమ నిధులెన్నో దొరికే
నీతోనే నా పంచ ప్రాణాలు పలికే


ఈ..ఈ..జగమంత పగబూని ఎదిరించినా
ఆ..ఆ విధి ఎంత విషమించి వేధించినా
నీవే నేనై ఉందాములే ..
ఆ ఆ..ఓ ఓ..ఆ ఆ ఆ ఆ...


నీ మనసు నా మనసు ఏకమై
నీ నీడ అనురాగ లోకమై
ప్రతి జన్మలోన జతగానే ఉందాములే...


No comments:

Post a Comment