Sunday, December 9, 2012

తెలిసింది తెలిసింది అబ్బాయిగారు

చిత్రం: గండికోట రహస్యం (1969) 
సంగీతం: టి.వి. రాజు 
గీతరచయిత: సినారె 
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 

పల్లవి: 

తెలిసింది తెలిసింది అబ్బాయిగారు 
తెల్లారిపోయింది మీ కోడెపొగరు... 
నేనే తోడు రాకుంటే..మీ పని అయ్యేది బేజారు 

తెలిసేది తెలిసేది అమ్మాయిగారు... 
నీలాటి రేవున్న నీ పిల్ల వగరు.. 
నేనే ఆదుకోకుంటే నీ పని అయ్యేది కంగారు... 

చరణం 1: 

మాటలు వింటుంటే కోటలు దాటే...టెక్కులు చూస్తుంటే చుక్కల మీటే 
మాటలు వింటుంటే కోటలు దాటే...టెక్కులు చూస్తుంటే చుక్కల మీటే 
తెలిసే రంగు పాలపొంగు...వట్టి హంగు వగలు పొంగు.. 
తెలిసే రంగు పాలపొంగు...వట్టి హంగు వగలు పొంగు.. 
నీ అల్లరి చూపుల కళ్ళెం వేసి ఆడించకు... 

తెలిసేది తెలిసేది అమ్మాయిగారు... 
నీలాటి రేవున్న నీ పిల్ల వగరు.. 
నేనే ఆదుకోకుంటే నీ పని అయ్యేది కంగారు... 

చరణం 2: 

కనుబొమ్మలాడితే కాలం ఆగే...విసురుగ సాగితే వెన్నెలలూగే... 
కనుబొమ్మలాడితే కాలం ఆగే...విసురుగ సాగితే వెన్నెలలూగే... 
లేత వయస్సు...లేడి సొగసు...కోతి మనసు కొంత తెలుసు 
లేత వయస్సు...లేడి సొగసు...కోతి మనసు కొంత తెలుసు 
నీ మెత్తని నవ్వుల గుత్తులు విసిరి వేధించకు... 

తెలిసింది తెలిసింది అబ్బాయిగారు 
తెల్లారిపోయింది మీ కోడెపొగరు... 
నేనే తోడు రాకుంటే..మీ పని అయ్యేది బేజారు 

తెలిసేది తెలిసేది అమ్మాయిగారు... 
నీలాటి రేవున్న నీ పిల్ల వగరు.. 
నేనే ఆదుకోకుంటే నీ పని అయ్యేది కంగారు... 

అహహహ..ఆహా..హా...అహహహ..ఆహా..హా... 
ఓహొహొహొహొ..ఓహో..హో...

No comments:

Post a Comment