Saturday, December 15, 2012

యమునా తీరాన

చిత్రం: గౌరవం (1970) 
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ 
గీతరచయిత: రాజశ్రీ 
నేపధ్య గానం: బాలు, సుశీల 

పల్లవి: 

యమునా తీరాన రాధ మదిలోన.. కృష్ణుని ప్రేమ కథా.... 
కొసరి పాడేటి కోరి వలచేటి.. మనసు నీది కదా.. 

చరణం 1: 

హృదయం తెలుపు ఊహలలో.. రాగం నిలుపు ఆశలలో.. 
తేనెల తేటల తీయని భావన.. ఊరెను నా మనసులో.. 
యమునా తీరాన రాధ మదిలోన.. కృష్ణుని ప్రేమ కథా.... 
కొసరి పాడేటి కోరి వలచేటి.. మనసు నీది కదా.. 

చరణం 2: 

ఎదలో తలపే... వణికెనులే 
అధరం మధురం... చిలికెనులే 
రాధా హృదయం... మాధవ నిలయం 
యమునా తీరాన రాధ మదిలోన.. కృష్ణుని ప్రేమ కథా.... 
కొసరి పాడేటి కోరి వలచేటి.. మనసు నీది కదా.. 

చరణం 3: 

మనసే నేడు వెనుకాడే.. హృదయం విరిసి కదలాడే 
లోలో భయము తొణికేనే..  ఎదలో సుఖము విరిసేనే 

పందిరిలో నిను పొందెద ఆ దినం.. ఆ దినమే పండుగ
యమునా తీరాన రాధ మదిలోన.. కృష్ణుని ప్రేమ కథా.... 
కొసరి పాడేటి కోరి వలచేటి.. మనసు నీది కదా.. 

No comments:

Post a Comment