Saturday, December 15, 2012

సుందరివంటే నువ్వేనంటు

చిత్రం: గోపి గోపిక గోదావరి (2009)
సంగీతం: చక్రి
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి
నేపధ్య గానం: వేణు, మధుమిత

పల్లవి:

హో లగిజిగి లగిజిగి లగిజిగి
హే గజిబిజి గజిబిజి గజిబిజి

సుందరివంటే నువ్వేనంటు చందరవంకే నీపేరంటు ముద్దులహారం మెళ్ళో వెయ్యనా
అబ్బబ్బా...
బందరులడ్డూ నువ్వేనంటు బంగరుజింకై దూకావంటూ ఇందరలోకం రాసిచ్చెయ్యనా
అబ్బబ్బా...
నువ్వు ముద్దన్నాక వద్దొద్దంటానా అట్టా హద్దే దాటి రావద్దంటానా...
ఆడ ఈడ నన్ను తాకొద్దంటానా కొంటె తాపాలేవొ పెంచొద్దంటానా...

అమ్మో అంతొద్దంటున్నా నిండా ముంచొద్దంటున్నా ఏదో సరదాకన్నానే లలనా
రాణీ నువ్వేలెమ్మన్నా రాజీకొస్తానంటున్నా పేచీ పెడితే ఎట్టాగే సుగుణా
చాల్లే చాలేగాని పోతేపోని సద్దేలేని బాతాఖానీ ఐసా పైసా కానీ అంటున్నా

హో లగిజిగి లగిజిగి లగిజిగి
హే గజిబిజి గజిబిజి గజిబిజి

సుందరివంటే నువ్వేనంటు చందరవంకే నీపేరంటు ముద్దులహారం మెళ్ళో వెయ్యనా
అబ్బబ్బా...
బందరులడ్డూ నువ్వేనంటు బంగరుజింకై దూకావంటూ ఇందరలోకం రాసిచ్చెయ్యనా
అబ్బబ్బా...

చరణం 1:

పైటే జారే మగువా ఏదో కోరే తెగువా ఏకై వచ్చి మేకైపోయావా...
చెంగేలాగే చొరవా చెంతేఉన్నా కలువా చుట్టూపక్కల చూస్తా ఉంటావా...
మూర్తాలన్ని ముడిపడని నీనోరే పండే తాంబూలాన్ని నేనవనా
వారం వర్జ్యం చూసుకొని నువ్వొచ్చేలోగా ఉసూరంటూ దిగులవనా
తాత్తై తత్తత్తై చిందులన్ని ఆపేసెయ్ ఈసారిట్టా పోనీలేవమ్మా

హో లగిజిగి లగిజిగి లగిజిగి
హే గజిబిజి గజిబిజి గజిబిజి

సుందరివంటే నువ్వేనంటు చందరవంకే నీపేరంటు ముద్దులహారం మెళ్ళో వెయ్యనా
అబ్బబ్బా...
బందరులడ్డూ నువ్వేనంటు బంగరుజింకై దూకావంటూ ఇందరలోకం రాసిచ్చెయ్యనా
అబ్బబ్బా...

చరణం 2:

అయ్యో పాపం అనవా నామాటేదీ వినవా అవి ఇవి ఇచ్చెయ్ గురువా...
సింగారాల వరువా శీతాకాలం చలవా పైపైకొచ్చి వేడెక్కిస్తావా...
రారమ్మంటే ఏదో పనిగా ఇందాక వచ్చా తీర వస్తే సిల్లీ గోడవా...
రై రై అంటూ రగే తేనీగా నీకంట్లో కచ్చా ఆర్చేదాకా ఓర్చగలవా ...
ఆశై అత్యాశై అల్లల్లాడే అర్జెంటై నీవైపొచ్చా సాయం చెయ్యవా...

హో లగిజిగి లగిజిగి లగిజిగి
హే గజిబిజి గజిబిజి గజిబిజి

సుందరివంటే నువ్వేనంటు చందరవంకే నీపేరంటు ముద్దులహారం మెళ్ళో వెయ్యనా
అబ్బబ్బా...
బందరులడ్డూ నువ్వేనంటు బంగరుజింకై దూకావంటూ ఇందరలోకం రాసిచ్చెయ్యనా
అబ్బబ్బా...

నువ్వు ముద్దన్నాక వద్దొద్దంటానా అట్టా హద్దే దాటి రావద్దంటానా...
ఆడ ఈడ నన్ను తాకొద్దంటానా కొంటె తాపాలేవొ పెంచొద్దంటానా

హో లగిజిగి లగిజిగి లగిజిగి
హే గజిబిజి గజిబిజి గజిబిజి

హో లగిజిగి లగిజిగి లగిజిగి
హే గజిబిజి గజిబిజి గజిబిజి

No comments:

Post a Comment