Monday, December 10, 2012

ఎవరికి వారౌ స్వార్ధంలో

చిత్రం: గుడిగంటలు (1965)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

ఎవరికి వారౌ స్వార్ధంలో
హృదయాలరుదౌ లోకంలో
ఎవరికి వారౌ స్వార్ధంలో
హృదయాలరుదౌ లోకంలో
నాకై వచ్చిన నెచ్చెలివి
అమృతం తెచ్చిన జాబిలివి
నాకమృతం తెచ్చిన జాబిలివి

చరణం 1:

ధనం కోరి మనసిచ్చే ధరణి
మనిషిని కోరి వచ్చావే
నా అనువారే లేరని నేను
కన్నీరొలికే కాలంలో
ఉన్నానని నా కన్నతల్లివలే
ఒడిని చేర్చి నను ఓదార్చావే

నాకై వచ్చిన నెచ్చెలివి
అమృతం తెచ్చిన జాబిలివి
నాకమృతం తెచ్చిన జాబిలివి

చరణం 2:

ప్రేమ కొరకు ప్రేమించేవారే
కాన రాక గాలించాను
గుండెను తెరచి ఉంచాను
గుడిలో దేవుని అడిగాను

గంటలు గణ గణ మ్రోగాయి
నా కంటి పాప నువ్వన్నాయి

నాకై వచ్చిన నెచ్చెలివి
అమృతం తెచ్చిన జాబిలివి
నాకమృతం తెచ్చిన జాబిలివి

చరణం 3:

ఈ అనురాగం ఈ ఆనందం
ఎవ్వరెరుగని ఈ అనుబంధం
ఈ అనురాగం ఈ ఆనందం
ఎవ్వరెరుగని ఈ అనుబంధం

కొండలు పాకి నీడలు పరచి
ఉండాలి వెయ్యేళ్ళు
చల్లగ ఉండాలి వెయ్యేళ్ళు
తియ్యగ పండాలి మన కలలు

ఎవరికి వారౌ స్వార్ధంలో
హృదయాలరుదౌ లోకంలో
నాకై వచ్చిన నెచ్చెలివి
అమృతం తెచ్చిన జాబిలివి
నా కమృతం తెచ్చిన జాబిలివి

No comments:

Post a Comment