Saturday, December 15, 2012

ఒకసారి కలలోకి రావయ్యా

చిత్రం: గోపాలుడు భూపాలుడు (1967)
సంగీతం: కోదండపాణి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, జానకి

పల్లవి:

ఒకసారి కలలోకి రావయ్యా
ఒకసారి కలలోకి రావయ్యా
నా మువ్విళ్ళు కవ్వించి పోవయ్యా

ఒకసారి రాగానే ఏమౌనులే ..
నీ హృదయాన శయనించి ఉంటానులే ..
ఏలుకుంటానులే …
ఒకసారి రాగానే ఏమౌనులే...
ఓ గొల్ల గోపయ్యా …

చరణం 1:

పగడాల నా మోవి చిగురించెరా ..
మోము చెమరించెరా .. మేను పులకించెరా
సొగసు వేణువు చేసి పలికించరా
సొగసు వేణువు చేసి పలికించరా

కెమ్మోవి పై తేనె ఒలికించనా …
కెమ్మోవి పై తేనె ఒలికించనా
తనివి కలిగించనా .. మనసు కరిగించనా
కేరింతలాడించి సోలించనా … కేరింతలాడించి సోలించనా...
ఒకసారి కలలోకి రావయ్యా.. ఆ.. ఆ..

చరణం 2:

ఒంపుసొంపుల మెరుపు మెరిపించవే
వగలు కురిపించవే.. మేను మరపించవే
మరపులో మధుకీల రగిలించవే..
మరపులో మధుకీల రగిలించవే

చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా.. ఆ..
చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా
మొగ్గ తొడిగిందిరా.. మురిసి విరిసిందిరా
పదును తేలిన వలపు పండించరా
పదును తేలిన వలపు పండించరా

ఒకసారి కలలోకి రావయ్యా
నా మువ్విళ్ళు కవ్వించి పోవయ్యా.. ఓ గొల్ల గోపయ్యా
ఒకసారి రాగానే ఏమౌనులే..

No comments:

Post a Comment