Sunday, December 9, 2012

ఆమని పాడవే హాయిగా


చిత్రం: గీతాంజలి (1989)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు



పల్లవి :



ఆమని పాడవే హాయిగా.. మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల...



ఆమని పాడవే హాయిగా..
ఆమని పాడవే హాయిగా.. 



చరణం 1 :



వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా
పదాల నా యెద స్వరాల సంపద
తరాల నా కథ క్షణాలదే కదా.... గతించి పోవు గాధ నేనని....
 



ఆమని పాడవే హాయిగా.. మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో....





చరణం 2 :



శుకాలతో పికాలతో.. ధ్వనించినా మధూదయం
దివి భువి కలా నిజం.. సృశించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై..
నివాళి కోరినా ఉగాది వేళలో...  గతించి పోని గాధ నేనని...



ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో.. పూసేటి పూలా గంధాలతో....



మంచు తాకి కోయిల మౌనమైన వేళల...
ఆమని పాడవే హాయిగా..
ఆమని పాడవే హాయిగా..




No comments:

Post a Comment