Sunday, December 9, 2012

పూచే పూలలోన

చిత్రం: గీత (1973)
సంగీతం: సత్యం
గీతరచయిత: జి. కె. మూర్తి
నేపధ్య గానం: బాలు

పల్లవి:

ఓహో..హో...
ఏహే..ఏహే...హే..
పూచే పూలలోన వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మోగెనే...
పూచే పూలలోన వీచే గాలిలోన
నీ అందమే దాగెనే ..ఏ.... నీ అందెలే మోగెనే ..
ఓ చెలీ ...ఈ.. ఓ చెలీ ..ఈ...

చరణం 1:

నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు...
నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు...
నా ఊపిరై నీవు నాలోన సాగెవు..
నీవు నా సర్వమే .. నీవు నా స్వర్గమే...
నీవు నా సర్వమే .. నీవు నా స్వర్గమే...
నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే...

పూచే పూలలోన ...వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మోగెనే
ఓ చెలీ ...ఈ.. ఓ చెలీ ...ఈ..

చరణం 2:

ఎన్నో జన్మల బంధము మనది
ఎవ్వరు ఏమన్నా ఇది వీడనిది
నీవు నా గానమే .. నీవు నా ధ్యానమే
నీవు నా గానమే .. నీవు నా ధ్యానమే
నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే...

పూచే పూలలోన... వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మోగెనే
ఓ చెలీ ...ఈ.. ఓ చెలీ ...ఈ..

No comments:

Post a Comment