Wednesday, December 19, 2012

ఒక బృందావనం సోయగం

చిత్రం: ఘర్షణ (1988)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: రాజశ్రీ
నేపధ్య గానం: వాణీ జయరాం

పల్లవి:

ఒక బృందావనం సోయగం
ఎద కోలాహలం క్షణక్షణం
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం

చరణం 1:

నే సందెవేళ జాబిలి.. నా గీతమాల ఆమని
నా పలుకు తేనె కవితలే.. నా కులుకు చిలక పలుకులే
నే కన్న కలల నీడ నందనం
నాలోని వయసు ముగ్ధ మోహనం
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం

చరణం 2:

నే మనసు పడిన వెంటనే ఓ ఇంధ్రధనుసు పొంగునే
ఈ వెండి మేఘమాలనే నా పట్టు పరుపు చేయనే
నే సాగు బాట జాజి పూవులే
నాకింక సాటి పోటి లేదులే
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ

No comments:

Post a Comment