Wednesday, December 19, 2012

నేను నీకై పుట్టినానని

చిత్రం: చంటబ్బాయి (1986)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

నేను నీకై పుట్టినానని
నిన్ను పొందకా మట్టికానని
చెమ్మగిల్లే కనులతో
చేయి పట్టే మనసుతో
చేసుకున్న బాసలో ఊసులే...ప్రేమ ....ఊపిరే ప్రేమ

చరణం 1:

నిన్ను చూడకా నిదురపోనీ..రెండు నేత్రాలు
కలల హారతి నీకు పట్టే..మౌన మంత్రాలు
నిన్ను తాకకా నిలవలేనీ..పంచ ప్రాణాలూ
కౌగిలింతలా గర్భగుడిలో... మూగ దీపాలు
ప్రేమ మహిమ తెలుప తరమా..
ప్రేమే...జీవన మధురిమా...

నేను నీకై పుట్టినానని
నిన్ను పొందకా మట్టికానని
చెమ్మగిల్లే కనులతో...
చేయి పట్టే మనసుతో...
చేసుకున్న బాసలో ఊసులే..ప్రేమ ....ఊపిరే ప్రేమ

చరణం 2:

స్త్రీ అనే తెలుగక్షరంలా నీవు నిలుచుంటే
క్రావడల్లే నీకు వెలుగులా ప్రమిదనై ఉంటా
ఓం...అనే వేదాక్షరంలా నీవు ఎదురైతే
గానమై నిన్నాలపించే..ప్రణవమై ఉంటా

ప్రేమ మహిమ తెలియ తరమా..
ప్రేమే... జీవన మధురిమా

నేను నీకై పుట్టినానని
నిన్ను పొందకా మట్టికానని
చెమ్మగిల్లే కనులతో
చేయి పట్టే మనసుతో
చేసుకున్న బాసలో ఊసులే..ప్రేమ ....ఊపిరే ప్రేమ

No comments:

Post a Comment