Monday, December 17, 2012

ఓరబ్బీ చెబుతాను

చిత్రం: ఖైదీ బాబాయ్ (1974)
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, జానకి 

పల్లవి: 

ఓరబ్బీ చెబుతాను.. ఓలమ్మీ చెబుతాను 
పండగ పూట ఒక నిండునిజం చెపుతాను 
ఏం చెపుతావూ? 
వాడు పగవాడుకాడు మంచి మగవాడని 
వాడు పగవాడుకాడు మంచి మగవాడని 

ఓరబ్బీ చెబుతాను.. ఓలమ్మీ చెబుతాను 
పచ్చాని పైరుమీద బాసచేసి చెపుతాను 
ఏం చెపుతావు? 
ఇది పల్లెకాదు.. చల్లని రేపల్లెని 
ఇది పల్లెకాదు.. చల్లని రేపల్లెని 

ఓరబ్బీ చెబుతాను.. 
ఓలమ్మీ చెబుతాను.. 

చరణం 1: 

చెడ్డ పనికి వుంటుంది చెరసాల శిక్ష 
మంచి పనికి వుంటుంది మరో రకం శిక్ష 
హోయ్.. చెడ్డపనికి వుంటుంది చెరసాల శిక్ష 
మంచి పనికి వుంటుంది మరో రకం శిక్ష 
ఈ శిక్ష నీకు వేసి మా కక్ష తీర్చుకుంటే..ఏ..ఏ.. 
ఈ శిక్ష నీకు వేసి మా కక్ష తీర్చుకుంటే.. నువ్వేమంటావూ? 

నా యాల్ది.. ఈ శిక్షయే శ్రీరామ రక్ష అని 
ఈ చెరసాలే మరుజన్మకు వుండాలని 
కోరుకొంటానూ ఇంకేమంటాను 

ఓరబ్బీ చెబుతాను.. 
ఓలమ్మీ చెబుతాను.. 

చరణం 2: 

ఈ పల్లె నన్ను మన్నించి తనవాడంటున్నది 
ఒక తల్లి మనసు నన్నింక పగవాడంటున్నది 
ఈ పల్లె నన్ను మన్నించి తనవాడంటున్నది 
ఒక తల్లి మనసు నన్నింక పగవాడనుచున్నది 
ఈ తప్పు ఎవరిదంటే.. ఇది తప్పేదెపుడంటే..ఏ..ఏ.. 
ఈ తప్పు ఎవరిదంటే ఇది తప్పేదెపుడంటే.. నువ్వేమంటావూ? 

ఓలమ్మో.. ఇది విధి చేతిలోని వింత వేట అని 
దీని తుది గెలుపు నీది నాది కానే కాదని 
అనుకొంటానూ.. ఇంకేమంటానూ.. 

ఓరబ్బీ చెబుతాను.. ఓలమ్మీ చెబుతాను 
పండగ పూట ఒక నిండునిజం చెపుతాను 
ఏంచెపుతావూ? 
వాడు పగవాడుకాడు మంచి మగవాడని 
వాడు పగవాడుకాడు మంచి మగవాడని 

ఓరబ్బీ చెబుతాను.. ఓలమ్మీ చెబుతాను 
పచ్చాని పైరుమీద బాసచేసి చెపుతాను 
ఏం చెపుతావు? 
ఇది పల్లెకాదు.. చల్లని రేపల్లెని 
ఇది పల్లెకాదు.. చల్లని రేపల్లెని 

ఓరబ్బీ చెబుతాను.. 
ఓలమ్మీ చెబుతాను..

No comments:

Post a Comment