Tuesday, December 11, 2012

ప్రేమా ఓ ప్రేమా

చిత్రం: గోకులంలో సీత (1997) 
సంగీతం: కోటి 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: బాలు 

పల్లవి: 

ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా 
ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా 
ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా 
వలపుల వనమా ఆ...ఆ...ఆ... 
వెలుగుల వరమా ఆ..ఆ..ఆ... 
ఈ ఎదలో కొలువుందువు రావమ్మా 

ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా 
ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా 

చరణం 1: 

ఎంత మధనమో జరగకుండ 
ఆ పాల కడలి కదిలిందా అమృతకలశమందిందా 
ఎన్ని ఉరుములో విసరకుండ 
ఆ నీలినింగి కరిగిందా నేలగొంతు తడిపిందా 
ప్రతి క్షణం హృదయం అడగనిదే చలువనీయవ ప్రేమా 
ప్రకృతిలో ప్రళయం రేగనిదే చిగురుతొడగవ ప్రేమా 
అణువణువూ సమిధలాయే ఈ యాగం శాంతిచేదెపుడమ్మా 

ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా 
ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా 

చరణం 2: 

ఆయువంతా అనురాగ దేవతకి 
హారతీయదలిచాడు ఆరిపోతు ఉన్నాడు 
మాయమైన మమకారమేది అని 
గాలినడుగుతున్నాడు జాలి పడవ ఈనాడు 
నిలువునా రగిలే వేదనలో విలయజ్వాలలు చూడు 
ప్రణయమే గెలిచే మధురిమతో చెలిమిజోలలు పాడు 
నీవంటూ లేకుంటే ఈ స్థితిలో ఏమౌతాడోనమ్మా 

ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా 
ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా 
వలపుల వనమా ఆ..ఆ..ఆ.. 
వెలుగుల వరమా ఆ..ఆ..ఆ.. 
ఈ ఎదలో కొలువుందువు రావమ్మా

No comments:

Post a Comment