చిత్రం: గుండమ్మ కథ (1962) సంగీతం: ఘంటసాల గీతరచయిత: పింగళి నేపధ్య గానం: ఘంటసాల పల్లవి: మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే తెలుపక తెలిపే అనురాగం నీ కనులనే కనుగొంటిలే నీ మనసు నాదనుకొంటిలే మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే చరణం 1: కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే ఆనందముతో అమృత వాహిని ఓలలాడి మైమరచితిలే మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే చరణం 2: ముసిముసినవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ముసిముసినవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే రుసరుసలాడుతు విసిరిన వాల్జడ వలపు పాశమని బెదరితిలే మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే | |
Monday, December 10, 2012
మౌనముగా నీ మనసు పాడిన
Labels:
గుండమ్మ కథ (1962),
ఘంటసాల,
పింగళి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment