Showing posts with label పింగళి. Show all posts
Showing posts with label పింగళి. Show all posts

Tuesday, December 5, 2023

ఏమిటో ఈ మాయా





చిత్రం : ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968)

సంగీతం :  పెండ్యాల 

గీతరచయిత :  పింగళి 

నేపథ్య గానం :  సుశీల, ఘంటసాల 


పల్లవి : 


ఏమిటో ఈ మాయా...  కలలోని కథవలెనాయె

ఏమిటో ఈ మాయా...  కలలోని కథవలెనాయె

ఏమిటో ఈ మాయా... 


అనుపల్లవి : 


వాణి నరసి వాణి నొరసి... మనసు విరిసేనే

తానుగా నను తాకెనే... అది నిజమే కారాదా


ఏమిటో ఈ మాయా... కలలోని కథవలెనాయె

ఏమిటో ఈ మాయా... 


చరణం 1 :


నాటిదో ఏ నాటిదో నేటి ఈ చెలిమి

నాటిదో ఏ నాటిదో నేటి ఈ చెలిమి

మేలుగా ఒక లీలగా... కల నిజమే కారాదా


ఏమిటో ఈ మాయా... కలలోని కథవలెనాయె

ఏమిటో ఈ మాయా... 


చరణం 2 : 


కనులు కలిసి మనసు తెలిసి... మేనులే సొలసి

కనులు కలిసి మనసు తెలిసి... మేనులే సొలసి

ఉంటిమని కలగంటి కదా... అది నిజమే కారాదా


ఏమిటో ఈ మాయా... కలలోని కథవలెనాయె

ఏమిటో ఈ మాయా... 


చరణం 3 : 


ఎన్ని జన్మల పరిచయముతో నన్ను పిలిచేనో సఖీ

ఎన్ని జన్మల పరిచయముతో నన్ను పిలిచేనో సఖీ

మేలుగా ఒక లీలగా కల నిజమే కారాదా


ఏమిటో ఈ మాయా... కలలోని కథవలెనాయె

ఏమిటో ఈ మాయా... 


చరణం 4 : 


వరుని కొరకై జీవితమంతా విరహ బాధయేనా

వరుని కొరకై జీవితమంతా విరహ బాధయేనా

మాయయే మటుమాయమై... కల నిజమే కారాదా


ఏమిటో ఈ మాయా... కలలోని కథవలెనాయె

ఏమిటో ఈ మాయా...



Thursday, September 27, 2018

అలుకమానవే చిలుకలకొలికిరో

చిత్రం :  శ్రీకృష్ణ సత్య (1971)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  పింగళి
నేపథ్య గానం :  ఘంటసాల, జానకి  



పల్లవి :



అలుకమానవే చిలుకలకొలికిరో... తలుపు తీయవే ప్రాణసఖి...
తలుపు తీయవే ప్రాణసఖి


దారి తప్పి ఇటు చేరితివా... నీ దారి చూసుకోవోయి...
నా దరికి రాకు... రాకోయి..


చరణం 1 :


కూరిమి కలిగిన తరుణివి నీవని... తరుణమునెరిగియే చేరితినే
కూరిమి కలిగిన తరుణివి నీవని.. తరుణమునెరిగియే చేరితినే
నీ నెరినెరి వలపునే కోరితినే...
నీ నెరినెరి వలపునే వేడితినే... 


అలుకమానవే చిలుకలకొలికిరో... తలుపు తీయవే ప్రాణసఖి...
తలుపు తీయవే ప్రాణసఖి



చరణం 2 :



చేసిన బాసలు చెల్లించని భల్ మోసగావేవోయి...
చేసిన బాసలు చెల్లించని భల్ మోసగావేవోయి...
ఇక ఆశ లేదు లేదోయి...
ఇక ఆశ లేదు పోవోయి...



దాసుని నేరము దండంతో సరి... బుసలు మాని ఓ వగలాడి...
దాసుని నేరము దండంతో సరి... బుసలు మాని ఓ వగలాడి.
నా సరసకు రావే సరసాంగి...
నా సరసకు రావే లలితాంగి...


అలుకమానవే చిలుకలకొలికిరో... తలుపు తీయవే ప్రాణసఖి...
తలుపు తీయవే ప్రాణసఖి




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18257

Tuesday, August 21, 2018

ప్రేమకోసమై వలలో పడెనే

చిత్రం :  పాతాళ భైరవి (1951)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  వి.జె. వర్మ


పల్లవి :


ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు... అయ్యో పాపం పసివాడు
ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు... అయ్యో పాపం పసివాడు


వేమరు దేవుల వేడుకొని తన కొమరుని క్షేమం కోరకొనీ...
ఓ... ఓ...ఓ... ఓ... ఓ... ఓ...ఓ... ఓ...
వేమరు దేవుల వేడుకొని తన కొమరుని క్షేమం కోరుకొనీ...
ఏమైనాడో ఏమౌనోయని కుమిలే తల్లిని కుములుమనీ


ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు... అయ్యో పాపం పసివాడు


చరణం 1 :



ప్రేమకన్ననూ పెన్నిధియేమని ఏమి ధనాలిక పెట్టుననీ...
ప్రేమకన్ననూ పెన్నిధియేమని ఏమి ధనాలిక పెట్టుననీ...
సమసిచూచు ఆ రాజకుమారిని నిముషమె యుగముగ గడపుమనీ...


ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు... అయ్యో పాపం పసివాడు



చరణం 2 : 



ప్రేమలుదక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొనీ
ప్రేమలుదక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొనీ
ఏమి రాసెనో అటుకానిమ్మని బ్రహ్మదేవుదె భారమనీ...



ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసి వాడు... అయ్యో పాపం పసివాడు
అయ్యో పాపం పసివాడు.... 




కనుగొనగలనో లేనో

చిత్రం : పాతాళ భైరవి (1951)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : పింగళి
నేపథ్య గానం :  ఘంటసాల 



పల్లవి :



కనుగొనగలనో లేనో...
కనుగొనగలనో లేనో... ప్రాణముతో సఖిని
కనుగొనగలనో లేనో



చరణం 1 :


పెండ్లి పీటపై ప్రియనెడబాయ... గాలి మేడలు గారడి కాగా
పెండ్లి పీటపై ప్రియనెడబాయ... గాలి మేడలు గారడి కాగా
కలకాలమును కర్మను దూచుచు... కలగా బ్రతకడమేనో 

కనుగొనగలనో లేనో... 



చరణం 2 :



వెదకి వెదకి యే జాడ తెలియక... హృదయమంతా చీకటిగా
వెదకి వెదకి యే జాడ తెలియక... హృదయమంతా చీకటిగా
ఎంత పిలచినా పిలుపే అందక... చింతిలి తిరగడమేనో 

కనుగొనగలనో లేనో


చరణం 3 :


పులివాతను బడు బాలహరిణియై... చెలి యెచ్చటనో చెరబడగా
పులివాతను బడు బాలహరిణియై... చెలి యెచ్చటనో చెరబడగా
జాలి లేని ఆ మాయదారికే బలిగా చేయడమేనో 


కనుగొనగలనో లేనో... ప్రాణముతో సఖిని
కనుగొనగలనో లేనో... కనుగొనగలనో లేనో




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=20

Friday, March 23, 2018

కాశీకి పోయాను

చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం :  ఘంటసాల, స్వర్ణలత 



పల్లవి :


కాశీకి పోయాను రామా హరి
గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి
గంగ తీర్థాము తెచ్చాను రామా హరి


కాశీకి పోలేదు రామా హరి
ఊరి కాల్వలో నీళ్ళండి రామా హరి
మురుగు కాల్వలో నీళ్ళండి రామా హరి 




చరణం 1 : 



ఈమె మాటలు పట్టించుకోకండి
ఈ పిల్ల మా మేనకోడలు
నన్ను సంసారలంపటంలో దింపటానికొచ్చింది


శ్రీశైలమెళ్లాను రామా హరి
శివుని వీభూది తెచ్చాను రామా హరి
శివుని వీభూది తెచ్చాను రామా హరి


శ్రీశైలం పోలేదు రామా హరి
శివుని వీభూది తేలేదు రామా హరి
ఇది కాష్టంలో బూడిదా రామా హరి 


చరణం 2 : 



అన్నమక్కరలేదు రామా హరి
నేను గాలి భోంచేస్తాను రామా హరి
ఉత్త గాలి భోంచేస్తాను రామా హరి


గాలితో పాటుగా రామా హరి
వీరు గారెలే తింటారు రామా హరి
నేతి గారెలే తింటారు రామా హరి



చరణం 3 : 


కైలాసమెళ్ళాను రామా హరి
శివుని కళ్ళారా చూశాను రామా హరి
రెండు కళ్ళారా చూశాను రామా హరి


కైలాసమెళితేను రామా హరి
నంది తన్ని పంపించాడు రామా హరి
బాగ తన్ని పంపించాడు రామా హరి



చరణం 4 :


ఆలుబిడ్డలు లేరు రామా హరి
నేను ఆత్మయోగీనండి రామా హరి
గొప్ప ఆత్మయోగీనండి రామా హరి


ఆ మాట నిజమండి రామా హరి
నేను అందుకే వచ్చాను రామా హరి
నేను అందుకే వచ్చాను రామా హరి





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6148

రామ రామ శరణం

చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం :  పి. లీల



పల్లవి :


రామ రామ శరణం... భద్రాద్రిరామ శరణం
రామ రామ శరణం...  


తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి
తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి
శిలకు ప్రాణమిచ్చి సన్నుతులు గాంచినట్టి



రామ రామ శరణం... భద్రాద్రిరామ శరణం
రామ రామ శరణం...  



చరణం 1 : 



శివుని విల్లు ద్రుంచి... శ్రీ జానకిని గ్రహించి
శివుని విల్లు ద్రుంచి... శ్రీ జానకిని గ్రహించి
జనకు మాటనెంచి వనవాసమేగినట్టి



రామ రామ శరణం... భద్రాద్రిరామ శరణం
రామ రామ శరణం...  



చరణం 2 : 



రావణుని వధించి ఘనకీర్తి జగతినించి
రావణుని వధించి ఘనకీర్తి జగతినించి
పాపముల హరించి భువినెల్ల గాచునట్టి



రామ రామ శరణం... భద్రాద్రిరామ శరణం
రామ రామ శరణం...  




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=29

Thursday, March 22, 2018

చేయి చేయి కలుపరావె

చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : ఏ. ఏం. రాజా, పి. లీల



పల్లవి :



చేయి చేయి కలుపరావె హాయిహాయిగ
నదురు బెదురు మనకింక లేదులేదుగ


చేయి చేయి కలుపరావె హాయిహాయిగ
నదురు బెదురు మనకింక లేదులేదుగ
అహా... చేయి చేయి


పెద్దవారి అనుమతింక లేదు లేదుగ
చేయి చేయి కలుపుటెల హాయి హాయిగ


పెద్దవారి అనుమతింక లేదు లేదుగ
చేయి చేయి కలుపుటెల హాయి హాయిగ
ఉహూ...  చేయి చేయి 



చరణం 2 : 



మగని మాటకెదురాడుట తగదు తగదుగ
నాతి చెంత విరహము నే తాళలేనుగ


మగని మాటకెదురాడుట తగదు తగదుగ
నాతి చెంత విరహము నే తాళలేనుగ


అహా...  చేయి చేయి


చరణం 2 : 



వీలుకాని విరహమింక వలదు వలదుగ
దాసి మీద వలపు మీకు తగదు తగదుగ


వీలుకాని విరహమింక వలదు వలదుగ
దాసి మీద వలపు మీకు తగదు తగదుగ


అహా...  చేయి చేయి కలుపరావె హాయిహాయిగ
నదురు బెదురు మనకింక లేదులేదుగ


అహా...  చేయి చేయి 






ఓ పంచవన్నెల చిలకా

చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : ఘంటసాల, స్వర్ణలత 


పల్లవి :


ఓ మరదలా... నాలో పొంగి పొరలే ప్రేమ వరదలా
నీరూ పాలూ కలిసి ఒకటైనటులే... నీవూ నేనూ ఒకటే గదా


ఓ పంచవన్నెల చిలకా...ఆ ?... ఆ
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక?
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక? 


మాటాడవేమే... మాటాడవేమే... నీ నోటి ముత్యాలొలక
పంచవన్నెల చిలకా... 


ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక?
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక? 



ఓహో బావా... మార్చుకో నీ వంకరటింకర దోవ
ఊరికే నీవూ నేనూ ఒకటేననుకుంటే...  ఒప్పుతుందా యీ లోకం?

ఓ కొంటె బావగారూ... హాయ్!
ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు?
ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు?
మా నాన్నగారు చూస్తే...
మా నాన్నగారు చూస్తే...  మీ దుమ్ము దులుపుతారు!


ఓ కొంటె బావగారూ...
ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు?




చరణం 1 :




సీమటపాకాయలాగ చిటాపటాలాడేవు
సీమటపాకాయలాగ చిటాపటాలాడేవు
ప్రేముందా లేదా... ఓ మరదలా నా మీద?


పంచవన్నెల చిలకా...
ఓ పంచవన్నెల చిలకా... నీకెందుకింత అలక?


చరణం 2 :



మరదలినైతే మాత్రం మరీ అంత చనువా?
మరదలినైతే మాత్రం మరీ అంత చనువా?
మరియాద కాదు మీ బావ మరిది చొరవ


ఓ కొంటె బావగారూ...
ఓ కొంటె బావగారూ... మనకెందుకింక పోరు?
మా నాన్నగారు చూస్తే...
మా నాన్నగారు చూస్తే...  మీ దుమ్ము దులుపుతారు


ఓ కొంటె బావగారూ... ఓ పంచవన్నెల చిలకా
ఓ కొంటె బావగారూ... ఓ పంచవన్నెల చిలకా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6149

మూగవైన ఏమిలే

చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం :  ఏ. ఏం. రాజా   



పల్లవి :


మూగవైన ఏమిలే... నగుమోమే చాలులే
సైగలింక చాలింపుము జాణతనము తెలిసెనులే
మూగవైన ఏమిలే...



చరణం 1 :



ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే 

ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే

దొంగ మనసు దాగదులే....

దొంగ మనసు దాగదులే.. సంగతెల్ల తెలిపెనులే

మూగవైన ఏమిలే...




చరణం 2 :



పలుకకున్న ఏమాయెను వలపు బాసలింతేలే
పలుకకున్న ఏమాయెను వలపు బాసలింతేలే
నను దయతో ఏలుకొనుమూ...
నను దయతో ఏలుకొమ్ము... కనుసన్నల మెలిగెదలే

మూగవైన ఏమిలే...


చరణం 3 : 



అందాలే బంధాలై నను బంధీ చేసెనులే
అందాలే బంధాలై నను బంధీ చేసెనులే
కలవరమిక ఎందుకులే...
కలవరమిక ఎందుకులే... వలదన్నా వదలనులే


మూగవైన ఏమిలే నగుమోమే చాలులే
సైగలింక చాలింపుము...  జాణతనము తెలిసెనులే
మూగవైన ఏమిలే...




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=22

సుందరాంగులను చూసిన వేళల

చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : ఘంటసాల, పి. లీల, ఏ. ఏం. రాజా   



పల్లవి :



సుందరాంగులను చూచిన వేళల... కొందరు ముచ్చటపడనేలా?
కొందరు పిచ్చనుపడనేలా?
సుందరాంగులను చూచిన వేళల... కొందరు ముచ్చటపడనేలా?
కొందరు పిచ్చనుపడనేలా?


అందము ప్రాయము ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా
అందము ప్రాయము ఐశ్వర్యముగల సుందరి దొరకుటే అరుదు కదా
ముందుగా ఎవరిని వరించునోయని తొందరలో మతి పోవుకదా


సుందరాంగులను చూచిన వేళల... కొందరు పిచ్చనుపడనేలా?
కొందరు ముచ్చటపడనేలా?


హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించు గదా
హృదయమునందలి ప్రేమగీతమే మధురముగా వినిపించు గదా
మందహాసమున మనసును దెలిపే ఇందువదన కనువిందు కదా



చరణం 1 :




ప్రేమపరీక్షలు జరిగే వేళల...  కొందరు పరవశ పడనేల?
కొందరు కలవరపడనేల?


యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా
యువతి చెంత పరపురుషుడు నిలిచిన భావావేశము కలుగు కదా
ప్రేమపందెమును గెలిచేవరకు నామది కలవరపడునుకదా




ప్రేమపరీక్షలు జరిగే వేళల... కొందరు కలవరపడనేల?
కొందరు పరవశ పడనేల?


కోయిలపలుకుల కోమలిగాంచిన.. తియ్యని తలపులు కలుగుగదా
కోయిలపలుకుల కోమలిగాంచిన.. తియ్యని తలపులు కలుగుగదా
వరములొసంగే ప్రేమదేవి గన పరవశమే మది కలుగుకదా


సుందరాంగులను చూసిన వేళల... 

కొందరు ముచ్చటపడనేలా?....
కొందరు పిచ్చనుపడనేలా?





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=509

ఎచటి నుండి వీచెనో

చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : ఘంటసాల, పి. లీల  



పల్లవి :


ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి


తీవెలపై ఊగుతూ...  పూవులపై తూగుతూ
తీవెలపై ఊగుతూ...  పూవులపై తూగుతూ
ప్రకృతినెల్ల హాయిగా.... ఆ.... ప్రకృతినెల్ల హాయిగా


తీయగా.. మాయగా.. పరవశింప జేయుచూ
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి





చరణం 1 :



జాబిలితో ఆడుతూ...  వెన్నెలతో పాడుతూ
జాబిలితో ఆడుతూ...  వెన్నెలతో పాడుతూ
మనసు మీద హాయిగా.... ఆ.... మనసు మీద హాయిగా


తీయగా...  మాయగా...  మత్తు మందు జల్లుతూ

ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి



చరణం 2 :



హృదయ వీణ మీటుతూ...  ప్రేమ గీతి పాడుతూ
హృదయ వీణ మీటుతూ...  ప్రేమ గీతి పాడుతూ
ప్రకృతినెల్ల హాయిగా.... ఆ.... ప్రకృతినెల్ల హాయిగా


తీయగా...  మాయగా...  పరవశింప జేయుచూ
ఎచటి నుండి వీచెనో... ఈ చల్లని గాలి...
ఈ చల్లని గాలి...  





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=521

కాలం కాని కాలంలో

చిత్రం : అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి
నేపధ్య గానం : సుశీల, పి. లీల 



పల్లవి :


చిగురుల పూవుల సింగారముతో... తీవెలు సొంపులు గనలే..దు
ముసి ముసి నవ్వుల గిలిగింతలతో... వసంత ఋతువా... రానేలే..దు


కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో ...
తరుణం కాని తరుణంలో... నా మది ఈ గుబులెందుకనో..
కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో ...

వలపులు మీటగ తీయని పాటలు... హృదయవీణపై పలికెనుగా
ప్రియతము గాంచిన ఆనందములో... మనసే వసంత ఋతువాయెనుగా..


కాలం కాని కాలంలో కోయిల కూతలందుకనే
తరుణం కాని తరుణంలో... నీ మది ఈ గుబులందుకనే..


చరణం 1 :



తళుకు బెళుకుల తారామణులతో... శారద రాత్రులు రాలేదు
ఆకాశంలో పకపకలాడుచూ రాకాచంద్రుడా... రానేలేదు


కాలం కాని కాలంలో... చల్లని వెన్నెల ఎందుకనో...
తరుణం కాని తరుణంలో...  నా మది ఈ గుబులెందుకనో..
కాలం కాని కాలంలో... చల్లని వెన్నెల ఎందుకనో...


తలచిన తలపులు ఫలించగలవని... బులపాటము బలమాయెనుగా..
పగటి కలలుగను కన్యామణులకే... ప్రియుడే...రాకాచంద్రుడుగా...


కాలం కాని కాలంలో... చల్లని వెన్నెల అందుకనే...
తరుణం కాని తరుణంలో... నీ మది ఈ గుబులందుకనే ..
కాలం కాని కాలంలో..చల్లని వెన్నెల అందుకనే







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=23

Tuesday, May 31, 2016

అతి ధీరవే గాని






చిత్రం: ప్రమీలార్జునీయం (1965)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: పింగళి
నేపధ్య గానం: ఘంటసాల




పల్లవి :


ఓ మనోజ్ఞ సుందరీ.. ... మాట...  మాట
అతి ధీరవే గాని... అపురూప రమణివే
అతి ధీరవే గాని... అపురూప రమణివే
జాగ్రత్త... జాగ్రత్త... జాగ్రత్త




చరణం 1 :



నీ సుకుమార ఠీవికి మురిసి
ఓ... నీ సుకుమార ఠీవికి మురిసి
నీ అసమాన ధాటికి దడిసి
ఎవని కనులు చెదరునో
నీకు దిష్టి తగులునో తరుణీ



అతి ధీరవే గాని... అపురూప రమణివే
జాగ్రత్త... జాగ్రత్త... జాగ్రత్త



చరణం 2 :



నీ నయగారమే సెలయేరుగా
నీ అనురాగమే సుడిగాలిగా.. ఆ..ఆ..
నీ నయగారమే సెలయేరుగా
నీ అనురాగమే సుడిగాలిగా


ఎవడు మూర్ఛ మునుగునో
నీ మనసు కరుగునో...  జవ్వనీ 



అతి ధీరవే గాని... అపురూప రమణివే
జాగ్రత్త... జాగ్రత్త... జాగ్రత్త



చరణం 3 :



నీ క్రీగంట విరిసిన చూపులు .. ఓ..ఓ..
నీ క్రీగంట విరిసిన చూపులు
అహ.. ప్రాణాల నొరిసే తూపులే


ఎవని గుండెలదరునో
నీకు జాలి కలుగునో రమణీ 





అతి ధీరవే గాని... అపురూప రమణివే
జాగ్రత్త... జాగ్రత్త... జాగ్రత్త




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=18378


Tuesday, September 23, 2014

నమో భూతనాధా





చిత్రం :  సత్య హరిశ్చంద్ర (1965)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత  :  పింగళి
నేపధ్య గానం :  ఘంటసాల, ఎస్. వరలక్ష్మి  


పల్లవి :


హే చంద్రచూఢ! మదనాంతక! శూలపాణే!
స్థాణో గిరీశ! గిరిజేశ! మహేశ! శంభో!
హే పార్వతీ హృదయవల్లభ.. చంద్రమౌళే
భూతాధిపా.. ప్రమథనాథ.. గిరీశ చాప...


నమో భూతనాధా... నమో దేవదేవా
నమో భక్తపాలా.. నమో దివ్యతేజా
నమో భూతనాధా.. నమో దేవదేవా
నమో భక్తపాలా.. నమో దివ్యతేజా
నమో భూతనాధా.... 


చరణం 1 :


భవా వేదసారా.. సదా నిర్వికారా
భవా వేదసారా.. సదా నిర్వికారా


జగాలెల్లబ్రోవ ప్రభూ నీవె కావా
నమో పార్వతీ వల్లభా.. నీలకంఠా


నమో భూతనాధా.. నమో దేవదేవా
నమో భక్తపాలా.. నమో దివ్యతేజా
నమో భూతనాధా  


చరణం 2 :


సదా సుప్రకాశా.. మహాపాపనాశా.... ఆ....
సదా సుప్రకాశా.. మహాపాపనాశా...


కాశీ విశ్వనాథా.. దయాసింధువీవే
నమో పార్వతీ వల్లభా.. నీలకంఠా


నమో భూతనాధా.. నమో దేవదేవా
నమో భక్తపాలా.. నమో దివ్యతేజా
నమో భూతనాధా...



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8223

Thursday, September 18, 2014

మనసు పరిమళించెనే

చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 



పల్లవి :

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. 

మనసు పరిమళించెనే..  తనువు పరవశించెనే
నవ వసంత గానముతో.. నీవు నటన సేయగనే


మనసు పరిమళించెనే..  తనువు పరవశించెనే
నవ వసంత రాగముతో.. నీవు చెంత నిలువగనే 

మనసు పరిమళించెనే.. తనువు పరవశించెనే


చరణం 1 :


నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా
ఆ..... ఆ.... . ఆ..... ఆ....
నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా
గలగలగల సెలయేరులలో కలకలములు రేగగా 

మనసు పరిమళించెనే.. ఆ.. ఆ.. హా..
తనువు పరవశించెనే.. ఓ..ఓ..ఓ..
నవ వసంత గానముతో... నీవు చెంత నిలువగనే 


మనసు పరిమళించెనే... తనువు పరవశించెనే


చరణం 2 :


క్రొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా
ఆహ .. ఆ . అ ఆ
క్రొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా
భ్రమరమ్ములు గుములు గుములుగా...  ఝుం ఝుమ్మని పాడగా
 


మనసు పరిమళించెనే... తనువు పరవశించెనే


చరణం 3 : 


తెలి మబ్బులు కొండ కొనలపై హంసల వలె ఆడగా
అహా .. ఆ . అ.. ఆ
తెలి మబ్బులు కొండ కొనలపై హంసల వలె ఆడగా
రంగరంగ వైభవములతో ప్రకృతి విందు సేయగా


మనసు పరిమళించెనే...  తనువు పరవశించెనే
నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే
మనసు పరిమళించెనే... తనువు పరవశించెనే


Tuesday, September 16, 2014

అన్నీ మంచి శకునములే

చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత : పింగళి
నేపథ్య గానం :  ఘంటసాల, సుశీల
 


పల్లవి :


అన్నీ మంచి శకునములే కోరిక తీరే దీవెనలే
అన్నీ మంచి శకునములే కోరిక తీరే దీవెనలే
మనసున మంగళవాద్యమాహా మోగెలే.... 


చరణం 1 :


నావలెనే నా బావ కూడా... నాకై తపములు చేయునులే..
తపము ఫలించి నను వరియించి..
తరుణములోనే బిరాన నన్ను చేరునులే ...


అన్నీ మంచి శకునములే కోరిక తీరే దీవెనలే
మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే... 


చరణం 2 :


అన్నీ మంచి శకునములే కన్యాలాభ సూచనలే
అన్నీ మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెనులే


కుడికన్ను అదిరే... కుడిభుజమదిరే
కోరిన చెలి నను తలచెనులే ....
చిరకాలముగా కాంచిన కలలు
నిజమౌ తరుణము వచ్చెనులే ...


అన్నీ మంచి శకునములే కన్యాలాభ సూచనలే
మనసున మంగళవాద్యమాహా మోగెలే


చరణం 2 : 


మల్లెతోరణల మంటపమందే కనులు మనసులు కలియునులే...
కలసిన మనసుల కలరవములతో జీవితమంతా వసంతగానమౌనులే...

అన్నీ మంచి శకునములే కోరిక తీరే దీవెనలే...
మనసున మంగళవాద్యమాహా మోగెలే..



Wednesday, July 2, 2014

శ్రీ జానకీ దేవీ సీమంతమలరే

చిత్రం :  మిస్సమ్మ (1955)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  పింగళి

నేపధ్య గానం :  పి. లీల


పల్లవి:


శ్రీ జానకీ దేవీ సీమంతమలరే
మహలక్ష్మి సుందర వదనము గనరే
శ్రీ జానకీ దేవి సీమంతమలరే


చరణం 1:


పన్నీరు గంధాలు సఖి పైన చిలికించి
కానుకలూ కట్నాలు చదివించరమ్మా
పన్నీరు గంధాలు సఖి పైన చిలికించి
కానుకలూ కట్నాలు చదివించరమ్మా


మల్లే మొల్లల తరులు సఖి జడను సవరించీ
ఎల్లా వేడుకలిపుడూ చేయించరమ్మా


శ్రీ జానకీ దేవీ సీమంతమలరే
మహలక్ష్మి సుందర వదనము గనరే
శ్రీ జానకీ దేవి సీమంతమలరే


చరణం 2:


కులుకుచూ కూచున్న కలికిని తిలకించి
అలుక చెందగనీక అలరించరమ్మా
కులుకుచూ కూచున్న కలికిని తిలకించి
అలుక చెందగనీక అలరించరమ్మా


కులమెల్ల దీవించు కొమరూని గనుమంచు
ఎల్లా ముత్తైదువులు దీవించరమ్మా


శ్రీ జానకీ దేవీ సీమంతమలరే
మహలక్ష్మి సుందర వదనము గనరే
శ్రీ జానకీ దేవి సీమంతమలరే


రావోయి చందమామ

చిత్రం :  మిస్సమ్మ (1955)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  ఏ. ఎం. రాజా, పి. లీల


పల్లవి:


రావోయి చందమామ.. మా వింత గాథ వినుమా
రావోయి చందమామ.. మా వింత గాథ వినుమా
రావోయి చందమామ..


సామంతము గల సతికీ ధీమంతుడనగు పతినోయ్
సామంతము గల సతికీ ధీమంతుడనగు పతినోయ్
సతి పతి పోరే బలమై సతమత మాయెను బ్రతుకే


చరణం 1:


రావోయి చందమామ.. మా వింత గాథ వినుమా
రావోయి చందమామ.. మా వింత గాథ వినుమా
రావోయి చందమామ


ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్
మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా


చరణం 2:


రావోయి చందమామ.. మా వింత గాథ వినుమా
రావోయి చందమామ..


తన మతమేమో తనదీ.. మన మతమసలే పడదోయ్
తన మతమేమో తనదీ.. మన మతమసలే పడదోయ్
మనమూ మనదను మాటే అననీయదు.. తాననదోయ్


చరణం 3:


రావోయి చందమామ.. మా వింత గాథ వినుమా
రావోయి చందమామ


నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా


రావోయి చందమామ... మా వింత గాథ వినుమా
రావోయి చందమామ

బాలనురా మదనా

చిత్రం :  మిస్సమ్మ (1955)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  సుశీల


పల్లవి:


బాలనురా... మదనా...
బాలనురా... మదనా...
విరి తూపులు వేయకురా... మదనా...
బాలను రా... మదనా...



చరణం 1:


నిలచిన చోటనే నిలువగ నీయక ఆ..
నిలచిన చోటనే నిలువగ నీయక
వలపులు కురియును రా
తీయని తలపులు విరియును రా..  మదనా


బాలనురా... మదనా...
విరి తూపులు వేయకురా... మదనా...
బాలను రా... మదనా..


చరణం 2:


చిలుకల వలే గోర్వంకల వలెనో ఓ..
చిలుకల వలే గోర్వంకల వలెనో
కులుకగ తోచును రా...
తనువున పులకలు కలుగును రా... మదనా...


బాలనురా... మదనా...
విరి తూపులు వేయకురా... మదనా...
బాలను రా... మదనా..



చరణం 3:


చిలిపి కోయిలలు చిత్తములో నే..ఏ..ఏ
చిలిపి కోయిలలు చిత్తములో నే
కలకల కూయును రా
మనసును కలవర పరచును రా.. మదనా


బాలనురా... మదనా...
విరి తూపులు వేయకురా... మదనా...
బాలను రా... మదనా..

బాబూ ధర్మం చెయ్ బాబు

చిత్రం :  మిస్సమ్మ (1955)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  పింగళి
నేపధ్య గానం :  రేలంగి


పల్లవి:


బాబూ... ఉ ఉ ఉ ఉ ఊ ఊ ఊ బాబూ.. బాబూ
బాబూ ధర్మం చెయ్ బాబు.. కాణీ ధర్మం చెయ్ బాబు
ధర్మం చేస్తే పుణ్యమొస్తది.. ఖర్మ నసిస్తది.. బాబూ
ధర్మం చెయ్ బాబు... కాణీ ధర్మం చెయ్ బాబు



చరణం 1:


కోటి విద్యలు కూటి కోసమే పూటే గడవని ముష్టి జీవితం
బాబు... కోటి విద్యలు కూటికోసమే పూటే గడవని ముష్టి జీవితం
పాటుపడగయే పని రాదాయే సాటి మనిషిని సావనా బాబూ
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు


చరణం 2:


ఐస్ క్రీమ్ తింటే ఆకలి పోదు కాసులతోనే కడుపు నిండదు
అయ్యా... అమ్మా... బాబూ...
చేసేదానం చిన్నదే అయినా పాపాలన్ని బాపును బాబూ
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు



చరణం 3:


నీ చెయ్ పైన నా చెయ్ కిందా ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ.. అయ్యా...
నీ చెయ్ పైన నా చెయ్ కిందా ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ
ముష్టి ఏమిటిది ముసలి బ్రహ్మ మన చిట్టాలు రాసే జమలే బాబూ
ధర్మం... అరణా ఒరణా రెండణా


ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
ధర్మం చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది బాబూ
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
అయ్యా... అమ్మా... బాబూ..