Monday, December 10, 2012

మేఘాలలో తేలిపొమ్మన్నది

చిత్రం: గులాబి (1996)
సంగీతం: శశి ప్రీతం
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: మనో, గాయత్రి
 

పల్లవి

మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది 
అమ్మాయితో సాగుతూ చిలిపి మది 
beat in my heart ఎందుకింత కొట్టుకుంది 
heat in my thought వెంటపడి చుట్టుకుంది 
oh my god ఏమిటింత కొత్తగున్నది 


beat in my heart ఎందుకింత కొట్టుకుంది 
heat in my thought వెంటపడి చుట్టుకుంది 
oh my god ఏమిటింత కొత్తగున్నది 

చరణం 1: 

హల్లో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు 
ఆలాపిస్తూ వుంటే స్వాగతాల సంగీతాలు 
ఆడగా నెమలి తీరుగా మనసు ఘల్ ఘల్ ఘల్లుమని 

ఆకాశమే హద్దు పావురాయి పాపాయికి 
ఆగే మాటే వద్దు అందమైన అల్లర్లకి 
మారదా వరద హోరుగా 
వయసు ఝల్ ఝల్ ఝల్లుమని 

ఓం నమః వచ్చి పడు ఊహలకు 
ఓం నమః కళ్ళు వీడు ఆశలకు 
ఓం నమః ఇష్టమైన అలజడికీ 

చరణం 2: 

మెచ్చినట్టే వుంది రెచ్చిపోయి పిచ్చి స్పీడు 
వద్దంటున్నా విందే చెంగుమంటూ చిందే ఈడు 
గువ్వలా రివ్వు రివ్వున యవ్వనం ఎటు పోతుంది 

కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు 
పందెం వేస్తా చూడు పట్టలేరు నన్నెవ్వడు 
అంతగా బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది 

నీ తరహా కొంప ముంచేటట్టే వుంది 
నా సలహా ఆలకిస్తే సేఫ్టీ వుంది 
ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది 

beat in my heart ఎందుకింత కొట్టుకుంది 
heat in my thought వెంటపడి చుట్టుకుంది 
oh my god ఏమిటింత కొత్తగున్నది 

beat in my heart .... 
heat in my thought .... 
oh my god ....

No comments:

Post a Comment