Monday, December 31, 2018
రుక్కు రుక్కు రుక్కుమిణి
చిత్రం : పెళ్లి (1997)
రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణ మణి... రబ్బా హోయ్ రబ్బా
విరిసీ విరియని మొగ్గరా ముద్దే తగలని బుగ్గరా
ఏయ్.. రుక్కు రుక్కు రుక్కుమిణీ.. హో..
కలికీ నీ కల తీరగా... ఇలకే చంద్రుడు జారెగా
రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణ మణి... రబ్బా హోయ్ రబ్బా
Thursday, September 1, 2016
సారి సారి సారి
చిత్రం : బావగారు బాగున్నారా? (1998)
సంగీతం : మణిశర్మ
గీతరచయిత : చంద్రబోస్
నేపధ్య గానం : మనో, స్వర్ణలత
పల్లవి :
సారి సారి సారి.. సో సారి సారి సారి.. హేయ్
సారి సారి సారి అంటుందోయ్ కుమారి
ప్యారి బ్రహ్మచారి మన్నించెయ్ ఈసారి
నిన్నే ఏరికోరి చేరిందోయ్ చిన్నారి
నువ్వేలేని దారి సహారా ఎడారి
తాగించాలా బిస్లెరి.. హేయ్ తినిపించాలా క్యాడ్బెరి
అందించాలా స్ట్రాబేరి.. కొంచెం మారాలి నీ వైఖరి
సారి సారి సారి అంటుందోయ్ కుమారి
ప్యారి బ్రహ్మచారి మన్నించెయ్ ఈసారి
చరణం 1 :
లవ్వులోనా చిన్న తప్పులే కామన్.. కమాన్
నవ్వమంటు వేడుకున్నది సాజన్
ఆ నింగి రాలిందా.. అట్లాంటిక్ పొంగిందా
తుఫాను రానుందా.. అణుబాంబ్ మీద పడనుందా
మూఢీగా వుండొద్దయ్యా.. నన్నే ముద్దులో ముంచాలయ్య
హేయ్.. దూరంగ వెళ్ళోద్దయ్యా.. నన్నే గాఢంగా వాటేయ్ ప్రియా..
సారి సారి సారి.. సో సారి సారి సారి.. హేయ్
చరణం 2 :
మొదటిసారి ఇలా జరిగితే.. కలహం హోయ్
ముందు ముందు కలిసి వుండుంటే ఖాయం
జూన్ ఎండ ముగిసాక జులై వాన వస్తుంది
నీ తీరు చూశాక.. తలకే ఆవిరవుతుంది
మాటల్లో దించావమ్మో నువ్వే టోటల్గా నెగ్గావమ్మో.. యమ్మో
మాయేదో చేశావమ్మో నన్నే మొత్తంగ మార్చవమ్మో
జాని జాని జాని విన్నా నీ కహాని
రాజా అంధ్రాస్థాని మెచ్చాడే నీ బాణి
చీకు చింత మాని అందించెయ్ జవాని
ఏదేమైనా కాని జైభోలో భవాని...
టుర్ర్ర్ర్.. టుర్ర్ర్ర్.. లలలలలాలాలా లలలలలాలాలా
లలలలలాలాలా లలలలలాలాలా హేహేహే
లలలలలాలాలా లలలలలాలాలా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9500
Friday, July 15, 2016
రండి రండి రండి దయ చేయండి
చిత్రం : రుద్రవీణ (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపథ్య గానం : మనో, ఎస్. పి. శైలజ, బాలు
పల్లవి :
రండి రండి రండి దయ చేయండి
తమరి రాక మాకెంతో సంతోషం సుమండి
రండి రండి రండి దయ చేయండి
తమరి రాక మాకెంతో సంతోషం సుమండి
నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు
ఆఁ... ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు
పలకరింపుతోనే మనసుమీటగలరు
ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచనగరు
తమరేనా సూర్య ఇలా కూర్చోండయ్యా
ఆగండి ఆగండి ఆగండి వద్దు కూర్చోకండి అక్కడ
తగిన చోటుకాదిది తమబోటి వారికీక్కడ
ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య
గడపదాటి ఇటువస్తే వారి పేరు స్వరాలయ్య
క్లయింట్లు కంప్లైంట్లు.. క్లయింట్లు కంప్లైంట్లు మసలే ఈ గది బారు
తక్కిన నా గృహమంత గాన కళకు దర్బారు...
రండి రండి రండి రండి దయ చేయండి
తమరి రాక మాకెంతో సంతోషం సుమండి
చరణం 1 :
బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ
బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ
చిర్రుబుర్రులాడటం కుర్చీలకు ఆచారం
ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం
వచ్చిన మిత్రులకోసం ముచ్చటగా ఉంటుందని
సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా
కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది?
ఉఁహుహు... బావుందండి
గానకళ ఇలవేల్పుగా వున్న మా ఇంట
శునకమైనా పలుకు కనకాంగి రాగాన
ఇచట పుట్టిన చిగురు కొమ్మైనా చేవ
గాలైనా కదలాడు సరిగమల త్రోవ
రావోయ్ రా ఇదిగో ఈయనే సూర్య ఈమె నా భార్య
ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్సు
ఆర్గుమెంటు వినకుండా తీర్పిచ్చే జస్టిస్సు
చాల్లేండి సరసం ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు
తకతో తకిటతోం తరికిటతోం తక తకిటతోం
స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు
పెడతా పో పెడతా పొగపెడతా పడకపెడతా
కొత్తవాళ్ళ ముందేవిటి వేళాకోళం
ఎవరేమనుకుంటారో తెలియని మేళం
ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన
సూర్యం గారని చెప్పానే ఆయనే ఈయన
అఁహాఁ... రండి రండి రండి దయచేయండి
తరమరి రాక మాకెంతో సంతోషం సుమండి
చరణం 2 :
వృద్ధాప్యంతో మంచంపట్టి తాళంతప్పక దగ్గడమన్నది
అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచలయ్య
ఖల్లు ఖల్లున వచ్చే చప్పుడు ఘల్లు ఘల్లున మార్చే విద్య
కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడలమధ్య
ఇదిగో మా పనమ్మాయి దీని పేరు పల్లవి
దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం
మా ఇంట్లో సందడికి ఈపిల్లే మరి పల్లవి
రండి రండి రండి దయచేయండి
తమరి రాక మాకెంతో సంతోషం సుమండి
పోస్ట్ పోస్ట్... పోస్ట్ పోస్ట్...
వావిలాల వరాలయ్య BA, LLB... పోస్ట్ పోస్ట్... పోస్ట్ పోస్ట్...
మా ఇంటికి ముందున్నవి కావు రాతిమెట్లు
అడుగుపెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు
రండి రండి రండి... రండి రండి రండి...
చరణం 3 :
మాకు నిలయ విద్వాంసులు చిలకరాజుగారు
కీరవాణి వీరిపేరు పలుకు తేనెలూరు
నవ్వు మువ్వకట్టి ప్రతినిముషాన్నీ తుళ్ళిస్తూ
సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ
ఇదే మాదిరి సుధామాధురి పంచడమే పరమార్థం
అదే అదే నా సిధ్ధాంతం
గానం అంటే ఒక కళగానే తెలుసు ఇన్నాళ్ళు నాకు
బ్రతుకే పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు
సంగీతంలో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళు
సంగీతంలో మాటలాడడం తా.. దా .. పద.. పద.. పద
మాటలనే సంగతులు చెయ్యడం
పని పని పనిసరి పనిసరిగా
సంగతులే సద్గతులనుకొనడం
సరిసరి సరిసరి సరిసరి సరిసరిగా సరిసరిగా
సరిగా తెలుసుకున్నాను ఈనాడు
సెలవిప్పిస్తే వెళ్ళొస్తా... మళ్ళీ మళ్ళీ వస్తూంటా... ఆ.. హా...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9093
చెప్పాలని ఉంది
చిత్రం : రుద్రవీణ (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపథ్య గానం : బాలు, మనో
పల్లవి :
ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే గద గుండె బలం తెలిసేది
దు:ఖానికి తలవంచితే తెలివి కింక విలువేది
మంచైనా చెడ్డైనా పంచుకోను మేలైన
ఆ మాత్రం ఆత్మీయతకైనా పనికిరానా
ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలులేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండి
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
గుండెల్లో సుడి తిరిగే కలత కథలూ
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చరణం 1 :
కోకిలల కుటుంబంలో చెడ బుట్టిన కాకిని అని
అయినవాళ్ళు వెలివేస్తే అయినా నేనేకాకిని
కోకిలల కుటుంబంలో చెడ బుట్టిన కాకిని అని
అయినవాళ్ళు వెలివేస్తే అయినా నేనేకాకిని
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
పాట బాట మారాలని చెప్పటమేనా నేరం
గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనె పాట పంచవన్నెల విరితోట
వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనె పాట పంచవన్నెల విరితోట
బతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళబాట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళబాట
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చరణం 2 :
ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం
ఏదీ మరి మిగతా కాలాలకు తాళం
నిట్టూర్పుల వడగాలుల శ్రుతిలో ఒకడు
కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
మంచు వంచనకు మోడై గోడు పెట్టు వాడొకడు
వీరి గొంతులోని కేక వెనుక ఉన్నదే రాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ నాదం
అని అడిగిన నా ప్రశ్నకు అలిగి మత్త కోకిల
కళ్ళు ఉన్న కబోదిలా చెవులు ఉన్న బధిరుడిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం
కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చరణం 3 :
అసహాయతలో దడ దడ లాడే హృదయమృదంగ ధ్వానం
నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం
ఎడారి బతుకుల నిత్యం చస్తూ సాగే బాధల బిడారు
దిక్కు మొక్కు తెలియని దీనుల యధార్థ జీవన స్వరాలు
నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి ఈ అపశ్రుతి సరిచెయ్యాలి
జన గీతిని వద్దనుకుంటూ నాకు నేనే హద్దనుకుంటూ
కలలో జీవించను నేను కలవరింత కోరను నేను
నేను సైతం విశ్వవీణకు తంతినై మూర్ఛనలుపోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను
నేను సైతం ప్రపంచాబ్జపు తెల్ల రేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం... బ్రతుకు పాటకు గొంతు కలిపేను
నేను సైతం నేను సైతం... బ్రతుకు పాటకు గొంతు కలిపేను
సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాకా
ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాకా
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
నేను సైతం.. నేను సైతం.. నేను సైతం
నేను సైతం.. నేను సైతం.. నేను సైతం
Wednesday, June 1, 2016
ఎక్కూ బండెక్కు మావా
చిత్రం : యముడికి మొగుడు (1988)
సంగీతం : రాజ్-కోటి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : మనో, సుశీల
పల్లవి :
ఎక్కూ బండెక్కు మావా.. ఎక్కి లాగించు మావా
చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా
గువ్వా గూడెక్కిపోయే మావా.. గుండె వేడెక్కె మావా
గూట్లో చటుంది రారా... అయ్యో రామా
ఇదిగున్నది ఈడొచ్చాక.. అది ఆగదు మనసిచ్చాక
నిన్ను రమ్మంటే విందుకు మోమాటమెందుకు అందగాడా
లేచిరమ్మంటే ముద్దుకు.. జున్నంటి ముద్దుకు చంటివాడా
ఎక్కూ బండెక్కు మావా.. ఎక్కి లాగించు మావా
చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా
చరణం 1 :
కన్నే కొట్టెసి చూడు.. చెయ్యే పట్టెసి చూడు
ఘాటుగా కాస్త నాటుగా
నన్నే చుట్టేసి చూడు.. చుట్టు కొలతెంతో చూడు
చాటుగా చెట్టు చాటుగా
ఓర్లో పాపిష్టి కళ్ళు... చేలో కోపిష్టి ముళ్ళు
ఒళ్లంత గుచ్చుకోవా
నాకే ఇచ్చేసి ఒళ్ళు... నాలో కట్టేసి ఇల్లు
రేయంత రెచ్చిపోకా
నీ మగసిరితోటే బేరం... నా సొగసే నీకిక లాభం
గుత్తి వంకాయ కూరలా గుమ్మెత్తిపోయెరా వన్నెలాడి
కొత్తరాటావకాయలా చిరెత్తినప్పుడే నువ్వు జోడి
ఎక్కూ బండెక్కు మావా.. ఎక్కి లాగించు మావా
చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా
గువ్వా గూడెక్కిపోయే మావా.. గుండె వేడెక్కె మావా
గూట్లో చటుంది రారా... అయ్యో రామా
చరణం 2 :
రవ్వాలడేట్టుకుంటా.. రాత్రి ముద్దెట్టుకుంటా
నేర్పవా... దారి చూపవా
ఈడే పెట్టెసుకుంటా.. ఈదీ ఒడ్డందుకుంటా
దక్కవా.. చేత చిక్కవా
ఉప్పుకారాలు తిన్న ఊసే నీ దగ్గరుంటే
నీదంత కట్టుకోనా
మునగాకడంటి నిన్ను ముద్దపప్పంటి నేను
ముప్పూటలొండుకోనా
నీ తట్టను నే దులిపేస్తా... నీ పిట్టకు నే వల వేస్తా
ఎంత బాలా కుమారుడే లీలా వినోదుడే పిల్లవాడు
అబ్బా... నందాకిశోరుదే.. అందాల చోరుడే చిన్నవాడు
ఎక్కూ బండెక్కు మావా.. ఎక్కి లాగించు మావా
చుక్కా చూరెక్కిపోయే అయ్యో రామా
గువ్వా గూడెక్కిపోయే భామా.. గుండె వేడెక్కె భామా
గూట్లో రూపాయి బిల్ల నాదే భామా
ఇదిగున్నది ఈడొచ్చాక... అది ఆగదు మనసిచ్చాక
నిన్ను రమ్మంటే విందుకు మోమాటమెందుకు అందగాడా
లేచి రమ్మంటే ముందుకు వచ్చాను అందుకు ముద్దులాడా..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9414
Tuesday, April 19, 2016
చలి చంపుతున్న చమక్కులో
చిత్రం: క్షణ క్షణం (1991)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: సిరివెన్నెల
నేపథ్య గానం: మనో, చిత్ర
పల్లవి :
శ్రావణ వీణ స్వాగతం.. స్.. ఆహహ
స్వరాల వెల్లువ Welcome
లేత విరిబాల నవ్వమ్మా ఆనందంలో... ఓ...ఓ...
జుంబాయే హాగుంబహేయ జుంబాయేఆగుంబహేయ
జుంబాయే హాగుంబహేయ హైగో హైగో హైగోహహే
జుంబాయే హాగుంబహేయ జుంబాయే హాగుంబహేయ
జుంబాయే హాగుంబహేయ హైగో హైగో హైగోహహే
ఏ... ఏఏఏఏ... ఏ... ఏఏఏఏ...
బకీవా...
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే హాగుంబయే ఆ జుంబాయే ఆగుంబయే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలి గింతగిచ్చింది
జుంబాయే ఆగుంబయే ఆ జుంబాయే హాగుంబయే
వయసాగనది రేగినది సరసములోనా
చలిదాగనిది రేగినది సరసకు రానా
కల తీరదులే తెలవారదులే
ఇది చక్కని చిక్కని చక్కిలిగిలి
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే ఆగుంబయే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలి గింతగిచ్చింది
జుంబాయే ఆగుంబయే
చరణం 1 :
అందిస్తున్న వగరే చిరుచిగురే తొడిగే
చిందిస్తున్న సిరులే మగసిరులే అడిగే
రమ్మంటున్న ఎదలో తుమ్మెదలే పలికే
ఝుమ్మంటున్న కలలో వెన్నెలెలే చిలికే
గలగలమని తరగల తరగని కల కదిలిన కథలివిలే
కలకలమని కులుకుల అలపలుగని చిలికిన సుధలివిలే
చెలువనిగని కలువల చెలువులు గని నిలువని మనసిదిలే
అలుపెరుగని అలరుల అలలనుగని
తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే
తలపడకిక తప్పదులే హే..హే..
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే ఆగుంబయే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలి గింతగిచ్చింది
జుంబాయే ఆగుంబయే
చరణం 2 :
ఊకొట్టింది అడవే మన గొడవే వింటూ
జోకొట్టింది ఒడిలో ఉరవడులేకంటూ
ఇమ్మంటుంది ఏదో ఏదేదో మనసు
తెమ్మంటుంది ఎంతో నీకంతా తెలుసు
అరవిరిసిన తలపుల కురిసెను కల కలసిన మనసులలో
పురివిరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులో
ఎద కొసరగ విసిరెను మధువుల వల అదిరిన పెదవులలో
జత కుదరగ ముసిరెను అలకల అల చిలకల పలుకులు
చిలికిన చినుకులలో తొలకరి సిరిజల్లులలో
ఏ... ఏఏఏఏ...
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే ఆగుంబయే ఆ జుంబాయే ఆగుంబయే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలి గింతగిచ్చింది
జుంబాయే ఆగుంబయే ఆ జుంబాయే ఆగుంబయే
వయసాగనది రేగినది సరసములోనా
చలిదాగనిది రేగినది సరసకు రానా
కల తీరదులే తెలవారదులే
ఇది చక్కని చిక్కని చక్కిలిగిలి
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే ఆగుంబయే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలి గింతగిచ్చింది
జుంబాయే ఆగుంబయే ఆ జుంబాయే ఆగుంబయే
ఆ జుంబాయే ఆగుంబయే ఆ జుంబాయే ఆగుంబయే
ఆ జుంబాయే ఆగుంబయే ఆ జుంబాయే ఆగుంబయే
జుంబాహే హాగుంబహే...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11026
Sunday, November 2, 2014
శోభనమే శోభనమే
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : అన్నమయ్య
నేపథ్య గానం : మనో
పల్లవి :
శోభనమే శోభనమే.. శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే.. శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే
చరణం 1 :
దేవదానవుల ధీరతను
ధావతిపడి వార్ధీతరువుగను
దేవదానవుల ధీరతను
ధావతిపడి వార్ధీతరువుగను
శ్రీవనితామణి చెలగి పెండ్లాడిన శ్రీవేంకటగిరి శ్రీనిధికీ
శోభనమే శోభనమే.. శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే.. శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే
Sunday, August 31, 2014
జివ్వుమని కొండగాలీ
చిత్రం : లంకేశ్వరుడు (1989)
సంగీతం : రాజ్-కోటి
గీతరచయిత : దాసరి
నేపథ్య గానం : మనో, జానకి
పల్లవి :
జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుందీ
వెచ్చనీ..కోరికా..రగిలిందిలే....
నీవేనా..ప్రేయసివే..నీదేలే..అందుకో ప్రేమగీతం
ఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీ
తీయనీ..కానుకా..దొరికిందిలే.....
నీవేనా..ప్రేమవులే..నీకేలే..అందుకో ప్రేమగీతం
జివ్వుమని కొండగాలీ కత్తిలా గుచ్చుతుందీ...
చరణం 1 :
ఒంపుల్లో సొంపుల్లో అందముందీ..కసిచూపుల్లో ఊపుల్లో పందెముందీ
ఒంపుల్లో సొంపుల్లో అందముందీ..కసిచూపుల్లో ఊపుల్లో పందెముందీ
కాశ్మీర కొండల్లో అందాలకీ..కొత్త అందాలు ఇచ్చావూ
కాశ్మీర వాగుల్లో పరుగులకీ..కొత్త అడుగుల్ని నేర్పావూ
నేనే..నిను కోరి చేరి వాలిపోవాలి
ఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీ
చరణం 2 :
మంచల్లే కరగాలీ మురిపాలూ..సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలూ
మంచల్లేకరగాలీ మురిపాలూ..సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలూ
కొమ్మల్లో పూలన్ని పానుపుగా మన ముందుంచె పూలగాలి
పూవుల్లో దాగున్న అందాలని మన ముందుంచె గంధాలుగా
నేనే..నిను కోరి చేరి వాలిపోవాలి
జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతుందీ
ఖస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతుందీ..
Wednesday, December 18, 2013
పెళ్ళికళ వచ్చేసిందే బాలా
చిత్రం: ప్రేమించుకుందాం.. రా (1997)
సంగీతం: మహేష్
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: మనో, చిత్ర, స్వర్ణలత
పల్లవి:
పెళ్ళికళ వచ్చేసిందే బాలా..
పల్లకిని తెచ్చేసిందే బాలా...
హడావిడిగా రెడి అవుదాం చలో లైలా
ముచ్చటగ మేళం వుంది... ఆజా ఆజా
తద్దినక తాళం వుంది... ఆజా ఆజా
మంటపం రమ్మంటుంది... ఆజా ఆజా
జంటపడు వేళయింది... ఆజా ఆజా
పెళ్ళికళ వచ్చేసిందే బాలా..
పల్లకిని తెచ్చేసిందే బాలా...
చరణం 1:
అక్షితలు వేసేసింది షాదీ
అడ్డుతెర తీసేసింది షాదీ
స్వయంవరమే శభాషంది హలో డార్లింగ్
ఇష్టపడు కన్యాదానం.. లేజా లేజా
జానెమన్ ఏ దుళన్ కో... లేజా లేజా
మై డియర్ హబ్బి ముజ్కో... లేజా లేజా
ఆశపడు అందం చందం... లేజా లేజా
అక్షితలు వేసేసింది షాదీ
అడ్డుతెర తీసేసింది షాదీ
చరణం 2:
ఆలుమగలై పోయామే... భామా
అసలు కథ బాకీ వుంది... రామ్మా
అమాంతంగా ప్రోసీడ్ అవుదాం చలో జాణా
మల్లెలతో మంచం సిద్ధం... దేఖో దేఖో
అల్లరితో మంత్రం వేద్దాం.. దేఖో దేఖో
మన్మధుని ఆహ్వానిద్దాం... దేఖో దేఖో
ముద్దులతో సన్మానిద్దాం... దేఖో దేఖో
ఆలుమగలై పోయామే... భామా
అసలు కథ బాకీ వుంది... రామ్మా
అమాంతంగా ప్రోసీడ్ అవుదాం చలో జాణా.. ఆ.. ఆ..
Tuesday, August 6, 2013
జూలై మాసం వస్తే తోడు చేరు వయసు
చిత్రం: పద్మవ్యూహం (1993)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: రాజశ్రీ
నేపధ్య గానం: మనో, అనుపమ
పల్లవి:
జూలై మాసం వస్తే తోడు చేరు వయసు
సందెవేళ వస్తే పాట పాడు మనసు
సిగ్గనేది ఎప్పుడో పాత కాలం మాట
కోటి ముద్దులు కోరవా కలలు పొంగే పూట
జూలై మాసం వస్తే తోడు చేరు వయసు
సందెవేళ వస్తే పాట పాడు మనసు
సిగ్గనేది ఎప్పుడో పాత కాలం మాట
కోటి ముద్దులు కోరవా కలలు పొంగే పూట
చరణం 1:
నింగినెగిరిపోదామా రాచిలకల రెక్కను అడగాలి
అర్ధరాత్రి విడిదికని జాబిల్లిని చోటే అడగాలి
గాలి దేవుని తోడడిగీ చూద్దామా దేశాలే
అడవి తల్లిని మాటడిగీ కడదామా గూడొకటి
అడగగానే చెయ్యదే గాలి మనకి సాయం
ప్రేమ అన్నది సర్వదా సర్వతేజా సత్యం
జూలై మాసం వస్తే తోడు చేరు వయసు
సందెవేళ వస్తే పాట పాడు మనసు
సిగ్గనేది ఎప్పుడో పాత కాలం మాట
కోటి ముద్దులు కోరవా కలలు పొంగే పూట
జూలై మాసం వస్తే తోడు చేరు వయసు
సందెవేళ వస్తే పాట పాడు మనసు
చరణం 2:
కొత్త కాదే ముద్దంటే ఇక భూతక వేషం వేయొద్దే
మనసు సర్వం నా సొంతం అది ఊసులతోనూ దాచొద్దే
కథలు పలికే పానుపిది కన్నీరే ఒద్దంట
ఆదమరచి ఐ లవ్ యూ చెప్పాలి నువ్వంట
అంతులేని ప్రేమిది నీకు నాకు యోగం
తోటి బాసల సాటులో పంచుకుందాం భాగం
జూలై మాసం వస్తే తోడు చేరు వయసు
సందెవేళ వస్తే పాట పాడు మనసు
సిగ్గనేది ఎప్పుడో పాత కాలం మాట
కోటి ముద్దులు కోరవా కలలు పొంగే పూట
Monday, July 22, 2013
గప్పుచిప్పు గప్పుచిప్పు
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: చంద్రబోస్
నేపథ్య గానం: మనో, చిత్ర
పల్లవి:
గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టే రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదట సారి నిన్ను చూసినప్పుడూ
అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు
నింగిలో చంద్రుడే నీకు పోలడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలు జారుడూ
ఎప్పుడెప్పుడూ...
గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
చరణం 1:
నువ్వు కానరాకపోతే కోపమొచ్చుడు
నువ్వు కంటి ముందు కొచ్చెనంటె కోరికొచ్చుడు
కౌగిలే కోరితే చెంతకొచ్చుడు
కౌగిలించుకోకపోతే నాకు చింత హెచ్చుడు
వెనక ముందు లాగుతుంది మనసు ఎప్పుడూ
ఇంత అంత కాదు దీని వింత గింజుడు
మనసునే గిల్లిన చిత్రహింసుడు
అబ్బ అమ్మతోడు నువ్వే నాకు రాజహంసుడూ
ఎప్పుడెప్పుడూ...
గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
చరణం 2:
ఇటుకపై ఇటుక వేస్తే ఇల్లు కట్టుడు
నే ముద్దు మీద ముద్దు పెడితే చిలక కొట్టుడు
పడకపై చల్లనీ పూల చల్లుడు
నీ పక్కలోన గుండెతోని గుండె అల్లుడు
కుంచెతోని రంగులద్దు చిత్రకారుడు
వీడు గోరుతోనే బొడ్డుపైన బొమ్మ గీస్తడు
నన్నిలా ముంచులా కరగదీసుడు
అమ్మో ఎన్ని కళలు ఉన్నవయ్య నీకు పిల్లడూ
ఎప్పుడెప్పుడూ...
గప్పుచిప్పు గప్పుచిప్పు గంతులిప్పుడు
నీ కొప్పులోన పువ్వులెట్టె రోజు ఎప్పుడు
సూటిగా అడిగితే ఎట్టా చెప్పుడు
నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
మొట్టమొదట సారి నిన్ను చూసినప్పుడూ
అత్తి పత్తి బుగ్గలోన ఆశ గుప్పెడు
నింగిలో చంద్రుడే నీకు పోలడు
నిన్ను చూడగానే నేర్చుకుంది కాలు జారుడూ
ఎప్పుడెప్పుడూ...
Wednesday, December 19, 2012
హే పిల్ల హల్లో పిల్ల
సంగీతం: కీరవాణి
గీతరచయిత: భువనచంద్ర
నేపధ్య గానం: మనో, చిత్ర
పల్లవి:
హే పిల్ల హల్లో పిల్ల
కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
జాంచక్క జెర్కలిచ్చి అందాలన్ని లెగ్గొట్టి కొట్టేయి అల్లం పెసరట్టు
పాంపప్ప హారం కొట్టి మా నట్టింటిలో కాలెట్టు అందిస్తా బెల్లం బొబ్బట్టు
రా.. చెలియా.. సఖియా త్వరగా ఇక మోగించేద్దాం లవ్లీ ట్రంపెట్టు
హే పిల్ల హల్లో పిల్ల
కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
చరణం 1:
చిట్కాలే వెయ్యమాకు వాణి ఆఖరు అంచుకి చేరుకొని
కంగారు పెట్టమాకు జాని చీకటి మొగ్గని కోరుకొని
కొత్త ఎత్తులో కొంగొత్త మత్తులో నక్కి నక్కి చూస్తే ఏం చేయను
మెత్త మెత్తగా గుమ్మెత్తి వత్తుగా నన్ను హత్తుకుంటే ఏం కాను
రా... మగువా మదనా త్వరగా ఇంకా పడగోట్టేస్తా ఇంకో వికెట్టు
హే పిల్ల హలో పిల్ల
కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
చరణం 2:
చింపేసి చుట్టుకుంది ఓణి చారెడు చూపులు గుచ్చుకొని
హోయ్ సిగ్గేదో దాచుకుంది ఓణి బారెడు ముద్దులు చాలవని
ఎన్ని చిక్కులో సన్నాయి నొక్కులో పిక్క ఎక్కువైతే ఏం కాను
వెక్కిరింపులో వెర్రెక్కు వంపులో చిచ్చి కొట్టమంటే ఏం చేయను
రా.. మగడా గురుడా సరదా మరి కొట్టించ్చేయి నీ ట్రాఫ్ఫిక్ టికెట్టు
హే పిల్ల హల్లో పిల్ల
కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
జాంచక్క జెర్కలిచ్చి అందాలన్ని లెగ్గొట్టి కొట్టేయి అల్లం పెసరట్టు
పాంపప్ప హారం కొట్టి మా నట్టింటిలో కాలెట్టు అందిస్తా బెల్లం బొబ్బట్టు
రా.. చెలియా.. సఖియా త్వరగా ఇక మోగించేద్దాం లవ్లీ ట్రంపెట్టు
హే పిల్ల హల్లో పిల్ల
కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
Monday, December 10, 2012
మేఘాలలో తేలిపొమ్మన్నది
సంగీతం: శశి ప్రీతం
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: మనో, గాయత్రి
పల్లవి:
మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది
అమ్మాయితో సాగుతూ చిలిపి మది
beat in my heart ఎందుకింత కొట్టుకుంది
heat in my thought వెంటపడి చుట్టుకుంది
oh my god ఏమిటింత కొత్తగున్నది
beat in my heart ఎందుకింత కొట్టుకుంది
heat in my thought వెంటపడి చుట్టుకుంది
oh my god ఏమిటింత కొత్తగున్నది
చరణం 1:
హల్లో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు
ఆలాపిస్తూ వుంటే స్వాగతాల సంగీతాలు
ఆడగా నెమలి తీరుగా మనసు ఘల్ ఘల్ ఘల్లుమని
ఆకాశమే హద్దు పావురాయి పాపాయికి
ఆగే మాటే వద్దు అందమైన అల్లర్లకి
మారదా వరద హోరుగా
వయసు ఝల్ ఝల్ ఝల్లుమని
ఓం నమః వచ్చి పడు ఊహలకు
ఓం నమః కళ్ళు వీడు ఆశలకు
ఓం నమః ఇష్టమైన అలజడికీ
చరణం 2:
మెచ్చినట్టే వుంది రెచ్చిపోయి పిచ్చి స్పీడు
వద్దంటున్నా విందే చెంగుమంటూ చిందే ఈడు
గువ్వలా రివ్వు రివ్వున యవ్వనం ఎటు పోతుంది
కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు
పందెం వేస్తా చూడు పట్టలేరు నన్నెవ్వడు
అంతగా బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది
నీ తరహా కొంప ముంచేటట్టే వుంది
నా సలహా ఆలకిస్తే సేఫ్టీ వుంది
ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది
beat in my heart ఎందుకింత కొట్టుకుంది
heat in my thought వెంటపడి చుట్టుకుంది
oh my god ఏమిటింత కొత్తగున్నది
beat in my heart ....
heat in my thought ....
oh my god ....
Thursday, December 6, 2012
పిల్లో జాబిల్లో
సంగీతం: రాజ్-కోటి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: మనో, చిత్ర
పల్లవి:
పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో
పెనుగులాడిన ప్రేమల కౌగిట్లో
పెదవులాడిన ముద్దుల చప్పట్లో
మెత్తగా.. హత్తుకో.. చిత్తులైన ఎత్తులన్ని మొత్తుకున్న మోజులోన
పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో
చరణం 1:
ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో
అందాలే ఆరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో
ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో
అందాలే ఆరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో
లల్లాయి తాళాలేసే నడుముల్లో నడకల్లో
జిల్లాయి లేనేలేదు పరువాల పడకల్లో
పిండుకుంటా తేనె నీ బొండుమల్లెల్లో
వండుకుంటా ఈడు నీ పండు ఎన్నెల్లో
కాచుకో.. కమ్ముకో.. ఖస్సుమన్న కోడెగాడు కాటువేసె కోనలోన
పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో
చరణం 2:
కార్తీక మాసాలిచ్చే కలువల్లో చలువల్లో
కౌగిళ్ళే మోసుకొచ్చే తగవుల్లో బిగువుల్లో
కార్తీక మాసాలిచ్చే కలువల్లో చలువల్లో
కౌగిళ్ళే మోసుకొచ్చె తగవుల్లో బిగువుల్లో
సంపంగి ధూపాలేసె గుండెల్లో విందుల్లో
సారంగి వీణలు మీటే వాగుల్లో ఒంపుల్లో
పండుకుంటా తోడు ఈ పైర గాలుల్లో
అల్లుకుంటా గూడు నీ పైట చాటుల్లో
ఆడుకో.. పాడుకో.. అందమంత కొల్లగొట్టే అల్లరింటి అల్లుడల్లె
పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరొ
హే పెనుగులాడిన ప్రేమల కౌగిట్లో
పెదవులాడిన ముద్దుల చప్పట్లో
మెత్తగా హత్తుకో చిత్తులైన ఎత్తులన్ని మొత్తుకున్న మోజులోన
పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరొ
ఘుం ఘుమాయించు కొంచెం
సంగీతం: రాజ్-కోటి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: మనో, చిత్ర
పల్లవి:
ఘుం ఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం
చెలి గాలి తగిలే వేళ
చెలికాడు రగిలే వేళ
గిలిగింత ముదిరే వేళ
గిజిగాడు ఎగిరే వేళ
అబ్బ సోకో పూతరేకో అందుతుంటే మోతగా
ఘుం ఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం
చరణం 1:
కానీ తొలి బోణీ కసి కౌగిళ్ళ కామిళ్ళతో
పోనీ మతిపోనీ పసి చెక్కిళ్ల నొక్కుళ్ళతో
రాణి వనరాణి వయసొచ్చింది వాకిళ్ళలో
రాజా తొలి రోజా విరబూసిందిలే ముళ్ళతో
తెలవారిపోతుందా తొలికోడి కూసింది
కలలేనే కంటున్నా కథ బాగా ముదిరింది
పొంగే వరద చెలరేగే సరదా
ఏదో మగత ఎద దాటే మమత
ఏది ఒప్పో ఏది సొప్పో మనకెంతో నచ్చదే
ఘుం ఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం
చరణం 2:
ఉంటా పడి ఉంటా నీ ఉయ్యాల సయ్యాటలో
గుంట చిరుగుంట నీ బుగ్గమ్మ నవ్వాటలో
మంట చలిమంట నను చుట్టేసె కూపాటలో
గంట అరగంట సరిపోవంట ముద్దాటలో
ఒకసారి చెబుతాడు ప్రతిసారి చేస్తాడు
అంటూనే ఛీ పాడు అందంతో రా పాడు
అయితే మగడు అవుతాడే మొగుడు
అసలే రతివి అవుతావే సఖివి
ఒంటికాయ సొంటి కంపు అంటుగుంటే ఘాటురా
ఘుం ఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం
చెలి గాలి తగిలే వేళ
చెలికాడు రగిలే వేళ
గిలిగింత ముదిరే వేళ
గిజిగాడు ఎగిరే వేళ
అబ్బ సోకో పూతరేకో అందుతుంటే మోతగా
ఘుం ఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం
Tuesday, December 4, 2012
ప్రియ ప్రియతమా రాగాలు
| చిత్రం: కిల్లర్ (1993) సంగీతం: ఇళయరాజా గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: మనో, చిత్ర పల్లవి: ప్రియ ప్రియతమా రాగాలు.. సఖీ కుశలమా అందాలు.. ప్రియ ప్రియతమా రాగాలు.. సఖీ కుశలమా అందాలు. నీ లయ పంచుకుంటుంటే... నా శృతి మించి పోతుంటే నాలో.. రేగే ప్రియ ప్రియతమా రాగాలు... సఖీ కుశలమా అందాలు... ప్రియ ప్రియతమా రాగాలు... సఖీ కుశలమా అందాలు... చరణం 1: జగాలు లేని సీమలో.. యుగాలు దాటే ప్రేమలు.. పెదాలు మూగ పాటలో... పదాలు పడే ఆశలు యెవరులేని మనసులో.. ఎదురు రావే నా చెలి.. అడుగు జారే వయసులో... అడిగి చూడు కౌగిలి ఒకే వసంతం.. కుహు నినాదం నీలో.. నాలో పలికే... ప్రియ ప్రియతమా రాగాలు.. సఖీ కుశలమా అందాలు.. నీ లయ పంచుకుంటుంటే... నా శృతి మించి పోతుంటే నాలో.. రేగే... ప్రియ ప్రియతమా రాగాలు... సఖీ కుశలమా అందాలు... చరణం 2: శరత్తులోనా వెన్నెల.. తలెత్తుకుంది కన్నుల.. షికారు చేసే కోకిల... పుకారు వేసే కాకిల ఎవరు ఎంత వగచిన... చిగురువేసే కోరిక నింగి తానే విడిచిన... ఇలకు రాదు తారక మదే ప్రపంచం.. విధే విలాసం.. నిన్ను.. నన్ను.. కలిపే.. ప్రియ ప్రియతమా రాగాలు.. సఖీ కుశలమా అందాలు.. ప్రియ ప్రియతమా రాగాలు.. సఖీ కుశలమా అందాలు.. నీ లయ పంచుకుంటుంటే... నా శృతి మించి పోతుంటే నాలో.. రేగే... ప్రియ ప్రియతమా రాగాలు... సఖీ కుశలమా అందాలు... ప్రియ ప్రియతమా రాగాలు.. సఖీ కుశలమా అందాలు.. | |
Monday, August 27, 2012
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చిత్రం : ఏప్రిల్ 1 విడుదల (1991) పల్లవి : చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చరణం 1: షోలే ఉందా ? ఖైదీ ఉందా? జగదేకవీరుడి కథా.. ఇది పాత పిక్చర్ కదా చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా చరణం 2 : ఒకటా రెండా.. పదులా వందా ఏవైంది భాగ్యం కథా? కదిలిందా లేదా కథా? చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా | |