Monday, January 21, 2013

కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలీ

చిత్రం: చంద్రముఖి (2005)
సంగీతం: విద్యాసాగర్
గీతరచయిత: వెన్నెలకంటి
నేపధ్య గానం: సుజాత, యదు బాలకృష్ణ

పల్లవి:

కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలీ
నిన్నకాలం మొన్నకాలం రేపు కూడ రావాలీ
కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలీ
నిన్నకాలం మొన్నకాలం రేపు కూడ రావాలీ
ఎంతకాలమెంతకాలం హద్దుమీరకుండాలీ
అంతకాలమంతకాలం ఈడునిద్దరాపాలీ
కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలీ
నిన్నకాలం మొన్నకాలం రేపు కూడ రావాలీ

చరణం 1:

గుండె విరహములో మండే వేసవిలో నువ్వే శీతకాలం
కోరే ఈ చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండకాలం
మదనుడికి పిలుపు మల్లెకాలం
మదిలోనే నిలుపు ఎల్లకాలం
చెలరేగు వలపు చెలికాలం
కలనైన తెలుపు కలకాలం
తొలిగిలి కాలం కౌగిలికాలం
మన కాలం ఇది ఆ ఆ ఆ ఆ

కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలీ
నిన్నకాలం మొన్నకాలం రేపు కూడ రావాలీ
ఎంతకాలమెంతకాలం హద్దుమీరకుండాలీ
అంతకాలమంతకాలం ఈడునిద్దరాపాలీ
కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలీ
నిన్నకాలం మొన్నకాలం రేపు కూడ రావాలీ

లాలాల లాలాల లాలాల
లాలాల లాలాల లాలాల
లాలాల లాలాల లాలాల

చరణం 2:

కన్నెమోజులకు సన్నజాజులకు కరిగే ఝాముకాలం
గుచ్చే చూపులకు గిచ్చే కైపులకు వచ్చే ప్రేమకాలం
తవితీరకుంది తడికాలం
క్షణమాగనంది ఒడికాలం
కడిగింది సిగ్గు తొలికాలం
మరిగింది మనసు మలికాలం
మరిసిరికాలం మగసిరికాలం మనకాలం పద
ఆ ఆ ఆ ఆ

కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలీ
నిన్నకాలం మొన్నకాలం రేపు కూడ రావాలీ
ఎంతకాలమెంతకాలం హద్దుమీరకుండాలీ
అంతకాలమంతకాలం ఈడునిద్దరాపాలీ
కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలీ
నిన్నకాలం మొన్నకాలం రేపు కూడ రావాలీ

No comments:

Post a Comment