Monday, January 28, 2013

గోవిందా .. గోవిందా

చిత్రం: చిలిపి కృష్ణుడు (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

గోవిందా .. గోవిందా..
జారిందా.. జారిందా..
కాలు జారిందా.. నేల జారిందా..
హారి కన్నెపిల్ల పైట జారిందా..
పైట జారి ఒంపుసొంపు బైట పెట్టిందా..


గోవిందా .. గోవిందా..
జారిందా.. జారిందా..
కాలు జారిందా.. నేల జారిందా..
హారి కన్నెపిల్ల పైట జారిందా..
పైట జారి ఒంపుసొంపు బైట పెట్టిందా..
పైట జారి ఒంపుసొంపు బైట పెట్టిందా..

గోవిందా .. గోవిందా..

చరణం 1:

కోక తడిసిపోయిందా..కొత్త మెరుపు తీరిందా
బుర్రు బుర్రు మంటుందా.. కొరుక్కు తిందామని వుందా
అహ అహ అహ...
కోక తడిసిపోయిందా..కొత్త మెరుపు తీరిందా
బుర్రు బుర్రు మంటుందా.. కొరుక్కు తిందామని వుందా

కొంగునట్టా గుంజుకోకూ..కుర్రవాణ్ణి నంజుకోకు
కొంగునట్టా గుంజుకోకూ..కుర్రవాణ్ణి నంజుకోకు

గోవిందా .. గోవిందా..
జారిందా.. జారిందా..
కాలు జారిందా.. నేల జారిందా..
హారి కన్నెపిల్ల పైట జారిందా..
పైటతోటి పడుచువాడి గుండె జారిందా..
పైటతోటి పడుచువాడి గుండె జారిందా..

గోవిందా .. గోవిందా..


చరణం 2:

కొంగు గాలి తగిలిందా.. కోర్కె కాస్త తీరిందా
తీట నీకు వచ్చిందా..లోటుపాటు తెలిసిందా
అహ అహ అహ...
కొంగు గాలి తగిలిందా.. కోర్కె కాస్త తీరిందా
తీట నీకు వచ్చిందా..లోటుపాటు తెలిసిందా

ఆశలింకా పెంచుకోకు.. అలసిపోయి సోలిపోకు
హాయ్ హాయ్ హాయ్ ..ఆశలింకా పెంచుకోకూ.. అలసిపోయి సోలిపోకు

గోవిందా .. గోవిందా..
జారిందా.. జారిందా..
కాలు జారిందా.. నేల జారిందా..
హారి కన్నెపిల్ల పైట జారిందా..
పైటతోటి పడుచువాడి గుండె జారిందా..

పైట జారి ఒంపుసొంపు బైట పెట్టిందా..
పైటతోటి పడుచువాడి గుండె జారిందా..

గోవిందా .. గోవిందా..

No comments:

Post a Comment