Monday, January 28, 2013

కుర్రాడనుకొని కులుకులు తీసే

చిత్రం: చిలకమ్మ చెప్పింది (1977)

సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం: బాలు


పల్లవి :


కుర్రాడనుకొని కులుకులు తీసే… హహ 

వెర్రిదానికీ పిలుపు 


కుర్రాడనుకొని కులుకులు తీసే

వెర్రిదానికీ పిలుపు..ఇదే నా మేలుకొలుపు



చరణం 1 :


మల్లెలు విరిసే మధువులు కురిసే

లేత సోయగమున్నది నీకు

మల్లెలు విరిసే మధువులు కురిసే

లేత సోయగమున్నది నీకు


దీపమంటి రూపముండి

దీపమంటి రూపముండి


కన్నె మనసే చీకటి చేయకు

కన్నె మనసే చీకటి చేయకు 


కుర్రాడనుకొని కులుకులు తీసే

వెర్రిదానికీ పిలుపు..ఇదే నా మేలుకొలుపు



చరణం 2 :



వెన్నెల చిలికే వేణువు పలికే

వేళ నీకిది నా తొలి పలుకు

వెన్నెల చిలికే వేణువు పలికే

వేళ నీకిది నా తొలి పలుకు


మూగదైన రాగ వీణ

మూగదైన రాగ వీణ


పల్లవొకటే పాడును చివరకు

పల్లవొకటే పాడును చివరకు!


కుర్రాడనుకొని కులుకులు తీసే

వెర్రిదానికీ పిలుపు..ఇదే నా మేలుకొలుపు


No comments:

Post a Comment