చిత్రం: చినరాయుడు (1992)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: భువనచంద్ర
నేపధ్య గానం: బాలు, జానకి
పల్లవి:
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే
ఎవరే ఎవరే పిలిచేది నేనెట్టా ఎట్టా పలికేది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
నక్కి నక్కి దాగేవారి పేరు చెప్పవే
ఎవరో ఎవరో తెలియందే
నేనెట్టా ఎట్టా పిలిచేది...
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
నక్కి నక్కి దాగేవారి పేరు చెప్పవే
చరణం 1:
కొంటె కోణంగి ఈడు కొట్టే కేరింత చూడు ఏదో గమ్మత్తుగుంది మావా
లేనే లేదంటు హద్దు ముద్దుముద్దుకి పద్దు రాస్తే ఎట్టా సత్యభామా
బంగారు గిన్నెలోని పరువాల పాయసాలు నీకే వుంచా నేను పోకిరి
చక్కంగ ముందుకొచ్చి సందేళ విందులిచ్చి కాదంటానా జత రా మరి
వారం వర్జ్యం చూడాలి ఆపైన నీతో ఓడాలి
చరణం 2:
ఇంటి తాళాలు దాచి గంట మోగించమంటే ఎట్టాగమ్మో గౌరమ్మో
జంట బాణాలు చూసి ఇట్టా రెట్టిస్తే నన్ను వేగేదెట్టా మావయ్యో
గోరింక గూటిముందు చిలకమ్మ చిందులేసి ఆడిందంటే అర్ధమేమిటో
మందారపువ్వు మీద మురిపాల తుమ్మెదొచ్చి వాలిందంటే మరి దేనికో
నీలో నేనే దాగాలి చెలరేగే తాపం తీరాలి
No comments:
Post a Comment