Wednesday, January 30, 2013

నయనాలు కలిసె తొలిసారి

చిత్రం: చైర్మన్ చలమయ్య (1974) 
సంగీతం: సలీల్ చౌదరీ 
గీతరచయిత: ఆరుద్ర 
నేపధ్య గానం: బాలు, సుశీల 

పల్లవి: 

ఊమ్మ్...ఊమ్మ్...ఊమ్మ్...ఊమ్మ్మ్...ఊమ్మ్మ్ 
నయనాలు కలిసె తొలిసారి.... 
హృదయాలు కరిగె మలిసారి... 
తలపే తరంగాలూరే... పులకించె మేను ప్రతిసారి.... 

నయనాలు కలిసె తొలిసారి.... 
హృదయాలు కరిగె మలిసారి... 
తలపే తరంగాలూరి... పులకించె మేను ప్రతిసారి.... 

లాలలా..లాలలా...లలలా...ఆ..ఆ..ఆ.. 

చరణం 1: 

నాలోనా...నీ పేరే...పాడేను రాగాలు... 
నాలోనా ...నీ రూపే... చేసేను చిత్రాలు... 

మదిలో ఏదో...పదే పదే ధ్వనించే...ఏ... 
మమతల తోటలలోనా తొలి వలపుల పూవులు పూచే... 

నయనాలు కలిసె తొలిసారి.... 
హృదయాలు కరిగె మలిసారి... 
తలపే తరంగాలూరి ...పులకించె మేను ప్రతిసారి.... 

ఆ..అహ..అహ...హ..హ...హ.... 

చరణం 2: 

నీలాల...మేఘాల...నీవేమో ఎగిరేవు... 
దూరానా...తీరానా....నీవేమో నిలచేవు... 

కలలే నీచే... ఇలా ఇలా నిజమాయే.... 
పరువము బంధము వేసే.... 
మన ప్రణయం బాసలు చేసే.... 

నయనాలు కలిసె తొలిసారి.... 
హృదయాలు కరిగె మలిసారి... 
తలపే తరంగాలూరి పులకించె మేను ప్రతిసారి....

No comments:

Post a Comment