Tuesday, January 29, 2013

ఏంటబ్బాయా..ఇదేటబ్బాయా

చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: దాసం గోపాలకృష్ణ
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

ఏంటబ్బాయా..ఇదేటబ్బాయా...
నా దుంప తెంచావు...నా కొంప ముంచావు..
నా వాలకం చూసి నా వాళ్ళడిగితే...
ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...
ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...
హమ్మా...ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...


ఏంటి చిట్టెమ్మ ..ఇదేం గోలమ్మా..
కుళ్ళుమోతోళ్ళు..నిను కూకలేస్తేను..
టాపు లేపలేవా..టోపీ వేయ్యలేవా..
ఏదో చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...
ఏదో చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...
హబ్బా...ఏదో చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...

చరణం 1:

కొత్తపల్లి కోక నే కోరి కట్టుకొచ్చా..
ఆవురావురుమంటు నన్నదిమి పట్టుకున్నావ్...
కొత్తపల్లి కోక నే కోరి కట్టుకొచ్చా..
ఆవురావురుమంటు నన్నదిమి పట్టుకున్నావ్...
నలిపి నలిపి వేశావ్..మురికి మురికి చేశావ్...

ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...
అయ్యయ్యయ్యొ.. చెప్పేది ..నేనేం చెప్పేది...
హమ్మా...ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...

కోకనదరు చూసి.. కోడెగిత్త బెదరి...
తాడు తెంచుకోని..తరిమి తరిమి వేసి...
కోకనదరు చూసి ..కోడెగిత్త బెదరి...
తాడు తెంచుకోని..తరిమి తరిమి వేసి...
బిత్తర బిత్తర చేసిందని వత్తి వత్తి పలకలేవా...

ఏదో చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...
ఏదో చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...
అరెరే...ఏదో చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...

చరణం 2:

జుట్టు చెదిరిపోయే...నా బొట్టు కరిగిపోయే...
బుగ్గలేమో కంది...మల్లెమొగ్గలేమో కమిలే...
జుట్టు చెదిరిపోయే...నా బొట్టు కరిగిపోయే...
బుగ్గలేమో కంది...మల్లెమొగ్గలేమో కమిలే...
ముస్తాబులన్నీ కూడా ముదనష్టమైపోయే...

ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...
ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...
హ..హ.....ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...

కొబ్బరితోట కాడ కోతిపిల్లను చూసి..
ఎక్కిరించబోతే...ఎగిరి గంతులేసి...
కొబ్బరితోట కాడ కోతిపిల్లను చూసి..
ఎక్కిరించబోతే...ఎగిరి గంతులేసి...
చిదిమి చిదిమి వదిలిందని గదిమి గదిమి చెప్పలేవా...

ఏదో చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...
హబ్బ.. చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...

అహ..ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...
అరెరే.. ఏదో చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...
అయ్యో..ఏం చెప్పేది ..నేనేం చెప్పేది...
ఏదో చెప్పేసేయ్...నువ్వేదో చెప్పేసేయ్...

No comments:

Post a Comment