Monday, January 28, 2013

ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ

చిత్రం: చల్ మోహన రంగ (1978)
సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్)
గీతరచయిత: జాలాది
నేపధ్య గానం: బాలు

పల్లవి:

ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ... కలహంస నడకల కలికి
సింగారమొలకంగ చీర కొంగులు జారే రంగైన నవమోహనాంగీ
ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోపమెందుకే కోమలాంగీ... రాణీ
ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ... కలహంస నడకల కలికి
ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోపమెందుకే కోమలాంగీ... రాణీ

చరణం 1:

అందాల గంధాలు పూసేయనా...
సింధూర కుసుమాలు సిగ ముడవనా...
అందాల గంధాలు పూసేయనా...
సింధూర కుసుమాలు సిగ ముడవనా...

చిలకమ్మో... కులికి పలుకమ్మో
ఆ... చిలకమ్మో.. కులికి పలుకమ్మో
నిలువెత్తు నిచ్చెన్లు నిలవేయనా... నీ కళ్ళ నెలవళ్ళ నీడంచనా

మడతల్లో.. మేని ముడతల్లో.. ముచ్చట్లో.. చీర కుచ్చిట్లో
మడతల్లో.. మేని ముడతల్లో.. ముచ్చట్లో.. చీర కుచ్చిట్లో

పసుపు పారాణేసి.. పట్టె మంచం వేసి
పసుపు పారాణేసి.. పట్టె మంచం వేసి
దొంతు మల్లెల మీద దొర్లించనా

అలివేణీ అలకల్లే.. నెలరాణి కులుకల్లే.. తరలెల్లి పోకమ్మా కలికీ
ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోపమెందుకే కోమలాంగీ... రాణీ
ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ... కలహంస నడకల కలికి

చరణం 2:

గగనాల సిగపూల పరుపేయనా... పన్నీటి వెన్నెల్లో ముంచేయనా
గగనాల సిగపూల పరుపేయనా... పన్నీటి వెన్నెల్లో ముంచేయనా

నెలవంకా.. చూడు నా వంక
చిట్టి నెలవంకా... చూడు నా వంక
నీ మేని హొయలన్నీ బులిపించనా.. ఎలమావి కోకేసి కొలువుంచనా

పొద్దుల్లో... సందపొద్దుల్లో.. నిద్దట్లో.. ముద్దు ముచ్చట్లో
పొద్దుల్లో... సందపొద్దుల్లో.. నిద్దట్లో.. ముద్దు ముచ్చట్లో

నట్టింట దీపాన్ని నడికొండ కెక్కించి
చీకట్ల వాకిట్లో చిందేయనా

పొగరంతా ఎగరేసి.. వగలన్నీ ఒలకేసి.. కవ్వించబోకమ్మా కలికీ
ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోమెందుకే కోమలాంగీ.. రాణీ
ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ... కలహంస నడకల కలికి
ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోపమెందుకే కోమలాంగీ... రాణీ

No comments:

Post a Comment