Monday, January 28, 2013

జీవితం సప్తసాగర గీతం

చిత్రం: చిన్ని కృష్ణుడు (1986)

సంగీతం: ఆర్.డి. బర్మన్

గీతరచయిత: వేటూరి

నేపథ్య గానం: బాలు, ఆషా భోంస్లే


పల్లవి :



తర..రా.తరతరా..తరా..తరా..తరతరా...


జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం

సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..

కల ఇల కౌగిలించే చోట


జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం

సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..

కల ఇల కౌగిలించే చోట



చరణం 1 :



ఏది భువనం ఏది గగనం తారా తోరణం

ఈ చికాగో సిరిసీ టవరే స్వర్గ సోపానమూ

ఏది సత్యం ఏది స్వప్నం డిస్ని జగతీలో

ఏది నిజమో ఏది మాయో తెలీయనీ లోకమూ



హే... బ్రహ్మ మానస గీతం

మనిషి గీసిన చిత్రం

చేతనాత్మాక శిల్పం

మతి కృతి పల్లవించే చోట...

మతి కృతి పల్లవించే చోట



జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం

సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..

కల ఇల కౌగిలించే చోట




చరణం 2 :


ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్చా జ్యోతులూ

ఐక్య రాజ్య సమితిలోనా కలిసే జాతులూ

ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు

ఈ మియామి బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ..



హే.......సృష్టికే ఇది అందం..

దృష్టికందని దృశ్యం

కవులు రాయని కావ్యం

కృషి ఖుషి సంగమించే చోట..

కృషి ఖుషి సంగమించే చోట



జీవితం సప్తసాగర గీతం వెలుగునీడల వేదం

సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట..

కల ఇల కౌగిలించే చోట





No comments:

Post a Comment