Tuesday, January 29, 2013

అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు

చిత్రం: చూడాలనివుంది (1998) 
సంగీతం: మణిశర్మ 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: బాలు, సుజాత 

పల్లవి: 

అబ్బబ్బా... ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు 
అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ముద్దు 
అబ్బబ్బా.. ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు 
అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ముద్దు 
చలిపులి పంజా విసిరితే... సల సల కాగే వయసులో 
గిల గిలలాడే సొగసుకే జో లాలి.... 

అబ్బబ్బా... ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు 
అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ముద్దు 

చరణం 1: 

వాటేసుకో వదలకు..... వలపుల వల విసిరి 
వాయించు నీ మురళిని వయసు గాలిపోసి 
దోచెయ్యనా దొరికితే..... దొరకని కోకసిరి 
రాసెయ్యనా పాటలే పైట చాటు చూసి 
ఎవరికి తెలియవు....... ఎద రసనసలు 
పరువాలాటకు...... పానుపు పిలిచాకా....... 
తనువు తాకినా తనివి తీరని వేళా...ఆ.. 

అబ్బబ్బా... ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు 
అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ముద్దు 

చరణం 2: 

జాబిల్లితో జతకలు.... జగడపు రగడలతో 
పొంకాలతో నిలు నిలు పొగడమాల వేసి 
ఆకాశమే కొలు కొలు..... తొడిమెడు నడుమిదిగో 
సూరీడునే పిలు పిలు చుక్క మంచుతోటి 
అలకల చిలకలు..... చెలి రుసరుసలు 
ఇక జాగెందుకు.... ఇరుకున పడిపోకా.... 
మనసు తీరినా వయసు జారనీ వేళా....ఆ 

అబ్బబ్బా... ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు 
అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ముద్దు 
చలిపులి పంజా విసిరితే... సల సల కాగే వయసులో 
గిల గిలలాడే సొగసుకే జో లాలి.... 

అబ్బబ్బా... ఇద్దూ.. అదిరేలా ఓ ముద్దు 
అమ్మమ్మా..... దిద్దు..... మధురాలా మరు ము..

No comments:

Post a Comment