Thursday, January 31, 2013

పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు

చిత్రం: జమిందారు (1966)
సంగీతం: టి. చలపతిరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు...
నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో..ఓ...మనసు పెనవేస్తే ఏమౌతావో..ఓ..ఓ..

ఉలికిపాటుతోనే...పులకరించిపోతావు
నేను ఔనంటే ఏంచేస్తావో..ఓ...కాదు పొమ్మంటే ఏమౌతావో..ఓ..ఓ...

చరణం 1:

మొలక నడుము హొయలు చూసి మురిసిపోదును..
జిలుగుపైట నీడలోన పరవశింతును ..
మొలక నడుము హొయలు చూసి మురిసిపోదును ..
జిలుగుపైట నీడలోన పరవశింతును...

సొగసులొలుకు నడుముహొయలు చూడనీయను
సొగసులొలుకు నడుముహొయలు చూడనీయను
కడకొంగున నిను బిగించి నడచిపోదునూ

ఉలికిపాటుతోనే...పులకరించిపోతావు
నేను ఔనంటే ఏంచేస్తావో..ఓ...కాదు పొమ్మంటే ఏమౌతావో..ఓ..ఓ...

చరణం 2:

పువ్వునై కురులలో పొంచియుందును...
నవ్వునై పెదవిపై పవ్వళింతును ..
పువ్వునై కురులలో పొంచియుందును..
నవ్వునై పెదవిపై పవ్వళింతును...

పూలతోడ నిన్ను కూడ ముడుచుకొందును
పూలతోడ నిన్ను కూడ ముడుచుకొందును
పెదవిపైన ఒదిగిన నిను కదలనియ్యను..ఊ..

పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు...
నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో..ఓ...మనసు పెనవేస్తే ఏమౌతావో..ఓ..ఓ..

చరణం 3:

కలలనైన నిన్ను నేను కలుసుకొందును
దొంగనై దోరవలపు దోచుకొందును ...
కలలనైన నిన్ను నేను కలుసుకొందును...
దొంగనై దోరవలపు దోచుకొందును...

చిలిపి చిలిపి మాటలింక చెల్లవందును ..ఊ..
చిలిపి చిలిపి మాటలింక చెల్లవందును ...
తొలివలపుల తియ్యదనం తెలుపమందును

పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు...
నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో..ఓ...మనసు పెనవేస్తే ఏమౌతావో..ఓ..ఓ..

ఉలికిపాటుతోనే...పులకరించిపోతావు
నేను ఔనంటే ఏంచేస్తావో..ఓ...కాదు పొమ్మంటే ఏమౌతావో..ఓ..ఓ...

No comments:

Post a Comment