Monday, January 28, 2013

ఎలా తెలుపను ఇంకెలా తెలుపను

చిత్రం: చిన్ననాటి కలలు (1975)
సంగీతం: టి. చలపతిరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

ఎలా తెలుపను ఇంకెలా తెలుపను
మది నిండా నీవే ఉంటే ఒక మాటైనా రాకుంటే
ఎలా తెలుపను ఇంకెలా తెలుపను

చరణం 1:

ఎన్నడు అందని పున్నమి జాబిలి
ఎన్నడూ.. అందని పున్నమి జాబిలీ...
కన్నుల ముందే కవ్విస్తుంటే..

కలగా తోచి... వలపులు పూచీ
కలగా తోచి... వలపులు పూచీ
తనువే మరచి తడబడుతుంటే

ఎలా తెలుపను ఇంకెలా తెలుపను
మదినిండా నీవే ఉంటే ఒక మాటైనా రాకుంటే
ఎలా తెలుపను ఇంకెలా తెలుపను


చరణం 2:

గుడిలో వెలసిన దేవుడు ఎదురై
గుడిలో.. వెలసిన దేవుడు ఎదురై
కోరని వరాలే అందిస్తుంటే

ఆ భావనలో ఆరాధనలో
ఆ భావనలో ఆరాధనలో
అంతట నీవే అగపడుతుంటే

ఎలా తెలుపను ఇంకెలా తెలుపను
మదినిండా నీవే ఉంటే ఒక మాటైనా రాకుంటే
ఎలా తెలుపను ఇంకెలా తెలుపను

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4047

No comments:

Post a Comment