Thursday, January 31, 2013

మ్రోగింది వీణ పదే పదే

చిత్రం: జమీందారు గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె. వెంకటేశ్
గీతరచయిత: దాశరధి
నేపధ్య గానం: బాలు

పల్లవి:

మ్రోగింది వీణ.. పదే.. పదే.. హృదయలలోన
ఆ దివ్య రాగం.. అనురాగమై.. సాగిందిలే...
మ్రోగింది వీణ.. పదే.. పదే.. హృదయలలోన
ఆ దివ్య రాగం.. అనురాగమై.. సాగిందిలే..

చరణం 1:

ఆధరాల మీద ..ఆడింది నీవే
ఆధరాల మీద ..ఆడింది నీవే
కనుపాపలందే .. కదిలింది నీవే
కనుపాపలందే .. కదిలింది నీవే
ఆ రూపమే మరీ మరీ.. నిలిచిందిలే

మ్రోగింది వీణ.. పదే.. పదే.. హృదయలలోన...


చరణం 2:

సిరిమల్లె పువ్వు .. కురిసింది నవ్వు
నెలరాజు అందం .. వేసింది బంధం
నెలరాజు అందం .. వేసింది బంధం
ఆ బంధమే మరీ మరీ ...ఆనందమే...

మ్రోగింది వీణ.. పదే.. పదే.. హృదయలలోన
ఆ దివ్య రాగం.. అనురాగమై.. సాగిందిలే..

No comments:

Post a Comment