Friday, February 1, 2013

ఎవ్వరు ఏమన్నా మారదు

చిత్రం: జయం (2002) 
సంగీతం: ఆర్.పి. పట్నాయక్ 
గీతరచయిత: కులశేఖర్ 
నేపధ్య గానం: ఆర్.పి. పట్నాయక్, ఉష 

పల్లవి: 

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా 
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా 
నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమా 
మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమా 
కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమా 
నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమా 

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా.. 
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా..ఆ.. 

చరణం 1: 

కాలమొస్తే సిరిమల్లె తీగకి చిగురే పుడుతుంది 
ఈడు వస్తే ఈ పడుచు గుండెలో ప్రేమే పుడుతుంది 
గొడుగు అడ్డుపెట్టినంతనే వాన జల్లు ఆగిపోవునా 
గులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవునా 
ఏడు లోకాలు ఏకం అయినా ప్రేమను ఆపేనా..ఆ.. 

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా.. 
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా.. 

చరణం 2: 

ప్రేమ అంటే ఆ దేవుడిచ్చిన చక్కని వరమంటా.. 
ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడూ అలుపే రాదంట 
కండలెంత పెంచుకొచ్చినా కొండనెత్తి దించలేరురా 
కక్షతోటి కాలు దువ్వినా ప్రేమనెవ్వరాపలేరుగా 
ప్రేమకెపుడైనా జయమే గాని ఓటమి లేదంట..ఆ 

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా 
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా.. 
నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమా 
మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమా 
కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమా 
నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమా 
శాశ్వతమీ ప్రేమా..

No comments:

Post a Comment