Wednesday, June 26, 2013

చిగురాకులలో ఒక చిలకమ్మ

చిత్రం: జీవితరథం (1981)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: రాజశ్రీ
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

చిగురాకులలో ఒక చిలకమ్మ
చిగురాకులలో ఒక చిలకమ్మ
నీ చెంతను వాలింది, గిలిగింతలు కోరింది
ఆశలే తెలుసుకో మనసులో నిలుపుకో
ఆశలే తెలుసుకో మనసులో నిలుపుకో
చిగురాకులలో ఒక చిలకమ్మా....

చరణం 1:

పొద్దుపొడుపు తోటలో ముద్దబంతి పూసింది
మూగ కళ్ళ ఊసులో ముచ్చటంత దాచింది
పొద్దుపొడుపు తోటలో ముద్దబంతి పూసింది
మూగ కళ్ళ ఊసులో ముచ్చటంత దాచింది
రేకు రేకులో నీ పేరే రాసిపెట్టుకున్నది
లేక లేక నీ గుండెల్లో గూడు కట్టుకున్నది
అందుకో అన్నది అందుకే ఉన్నది
అందుకో అన్నది అందుకే ఉన్నది

చరణం 2:

కలల కలవరింతలో కనులు కతలు చెప్పాలి
మాట రాని వేళలో మనసులొకటి కావాలి
కలల కలవరింతలో కనులు కతలు చెప్పాలి
మాట రాని వేళలో మనసులొకటి కావాలి
తోడు నీడగా నీ ఒడిలో కోటి కలలు పండని
ప్రేమ సీమకు ఈ వేళా మేలుకొలుపు పాడని
ఆశలే పొంగనీ...బాసలే తీరనీ
ఆశలే పొంగనీ...బాసలే తీరనీ

No comments:

Post a Comment