Friday, June 21, 2013

ఈ రేయి తీయనిది

చిత్రం: జాని (2003) 
సంగీతం: రమణ గోగుల 
నేపధ్య గానం: హరిహరణ్, నందిత 

పల్లవి: 

ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది 
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది 
ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి 
ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి 

చరణం 1: 

ఓ వరములా దొరికెనీ పరిచయం 
నా మనసులో కురిసెనే అమృతం 
నా నిలువునా అలలయే పరవశం 
నీ చెలిమికే చేయని అంకితం 
కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం 

ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి 
ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి 

చరణం 2: 

నీ ఊపిరే వెచ్చగా తగలని 
నా నుదుటిపై తిలకమై వెలగని 
నా చూపులే చల్లగా తాకని 
నీ పెదవిపై నవ్వుగా నిలవని 
ఆశలకే అయువుగా మారెను నీ స్నేహం 

ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది 
ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది 
ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది

No comments:

Post a Comment