Wednesday, June 26, 2013

ఏ రాగమనే పాడను

చిత్రం: జీవన తీరాలు (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

ఆ... ఆ.. ఆ... ఆ....
ఏ రాగమనే పాడను... ఏ తీగ నే మీటను
ఏ రాగమనే పాడను... ఏ తీగ నే మీటను
ఎదుట రూపమే ఎదను దీపమై...
నుదిటి తిలకమై మెరిసిన వేళా...
నవరస.. కన్నడ.. వసంత.. వరాళి..
మోహన.. కళ్యాణి.. ఆనందభైరవి...
ఆ... ఆ... ఆ... ఆ

ఏ రాగమనే పాడను... ఏ తీగ నే మీటను

చరణం 1:

మూగవేదనకు రాగాలన్నీ.. ముద్దు మాటలని తెలుసు
రాగమేది నే ఆలపించినా.. యోగమిదేనని తెలుసు
మూగవేదనకు రాగాలన్నీ.. ముద్దు మాటలని తెలుసు
రాగమేది నే ఆలపించినా.. యోగమిదేనని తెలుసు

తెలిసి తెలిసి ఏ తీగ మీటినా.. తెల్లవారదా నా బ్రతుకు
తెలిసి తెలిసి ఏ తీగ మీటినా.. తెల్లవారదా నా బ్రతుకు
నీ చల్లని నవ్వుల వెన్నెలలే.. నా సిగను పువ్వులై విరిసిన వేళా...

నవరస.. కన్నడ.. వసంత.. వరాళి..
మోహన.. కళ్యాణి.. ఆనందభైరవి...
ఆ... ఆ... ఆ... ఆ
ఏ రాగమనే పాడను... ఏ తీగనే మీటను

చరణం 2:

వయసు వసంతాలాడిన నాడు... మనసు మోడుగా మిగిలింది
ఎడారి దారుల నడచిన నాడు... ఎదలో కోయిల పలికింది
వయసు వసంతాలాడిన నాడు... మనసు మోడుగా మిగిలింది
ఎడారి దారుల నడచిన నాడు... ఎదలో కోయిల పలికింది

గతము తలచి నా గతికి వగచి నేనున్న వేళ నాకున్నావు..
గతము తలచి నా గతికి వగచి నేనున్న వేళ నాకున్నావు..
నీ చల్లని చూపుల పల్లవితో... నా బ్రతుకు పాటగా మారిన వేళా...

ఏ రాగమనే పాడను... ఏ తీగనే మీటను
ఎదుట రూపమే ఎదను దీపమై...
నుదిటి తిలకమై మెరిసిన వేళా...
నవరస.. కన్నడ.. వసంత.. వరాళి..
మోహన.. కళ్యాణి.. ఆనందభైరవి...
ఆ... ఆ... ఆ... ఆ

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4208

No comments:

Post a Comment