Wednesday, June 26, 2013

ఓలమ్మో ఓర్నాయనో

చిత్రం: జీవితం (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఎల్.ఆర్. ఈశ్వరి

పల్లవి:

మావిడి తోపుల్లోనా.. మాపటేల మాటేసి
చిక్కుడు పాదుకాడ.. చీకటేల పట్టేసి

మావిడి తోపుల్లోనా.. మాపటేల మాటేసి
చిక్కుడు పాదుకాడ.. చీకటేల పట్టేసి

చెప్పలేని రుచులెన్నో.. చిటికెలోన చూపించి
చెప్పలేని రుచులెన్నో.. చిటికెలోన చూపించి
చూపించి..

మాయ చేసి పోతివిరో నాగులూ.. నా మాట మరచిపోతివిరో నాగులు

ఓలమ్మో.. ఓలమ్మో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..

చరణం 1:

నిన్నే.. కావాలని ఎన్నుకొంటిని
నీ చుట్టూ.. నా మనసే అల్లుకొంటిని
రేకెత్తే నా సొగసే.. నీకు ముడుపు కడితిని
ఇన్నీ చేసినదాన్నీ.. ఏమెరుగని చినదాన్నీ
ఇన్నీ చేసినదాన్నీ.. ఏమెరుగని చినదాన్నీ
ఉమ్..ఉమ్..
మాయ చేసి పొతివిరో నాగులూ.. నా మాట మరచిపోతివిరో నాగులు

ఓలమ్మో.. ఓలమ్మో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..

చరణం 2:

నట్టింట.. ఒంటరిగా కాచుకొంటిని
నడిరాతిరి ఉసురుసురు అంటూ.. వేచి ఉంటిని
ఆకు చప్పుడైనా.. నీ అడుగుల్లే అనుకొంటిని
నిన్నే నమ్మినదాన్నీ.. నీకే నచ్చినదాన్నీ
నిన్నే నమ్మినదాన్నీ.. నీకే నచ్చిన దాన్నీ

కాదు మరి..

మాయచేసి పోతివిరో నాగులూ.. నా మాట మరచిపోతివిరో నాగులు

ఓలమ్మో.. ఓలమ్మో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..

చరణం 3:

తొలినాటి.. తొందరలు ఏమాయెరా
ఆ బులిపాలు మురిపాలు.. కరువాయెరా
నిద్దర పోతూ ఉన్నా.. ఆ ముద్దులే గురుతాయెరా
చిగురాకు లాంటిదాన్నీ.. వగలేది లేనిదాన్నీ
చిగురాకు లాంటిదాన్నీ.. వగలేది లేని దాన్నీ
ఉమ్.. పాపం..

మాయ చేసి పోతివిరో నాగులూ.. నా మాట మరచిపోతివిరో నాగులు

ఓలమ్మో.. ఓలమ్మో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..
ఓలమ్మో ఓర్నాయనో..

No comments:

Post a Comment