Monday, June 17, 2013

అలా మండి పడకే జాబిలి

చిత్రం: జాకి (1985)

సంగీతం: బాలు

గీతరచయిత: వేటూరి

నేపథ్య గానం: జానకి


పల్లవి:


అలా మండి పడకే జాబిలి..ఈ...ఈ.. 

చలి ఎండ కాసే రాతిరి..

దాహమైన వెన్నెల రేయి

దాయలేను ఇంతటి హాయి

ఎలా తెలుపుకోనూ ప్రేమని

ఎలా పిలుచుకోనూ రమ్మని


అలా మండి పడకే జాబిలి… చలి ఎండ కాసే రాతిరి



చరణం 1:


నిన్ను చూడకున్నా.. నీవు చూడకున్నా...

నిదురపోదు కన్నూ... నిశి రాతిరి..

నీవు తోడు లేకా... నిలువలేని నాకు..

కొడిగట్టునేలా…  కొన ఊపిరీ

ఇదేనేమో బహుశా తొలినాటి ప్రేమా

ఎలా పాడుకోనూ నిట్టూర్పు జోలా



ఈ పూల బాణాలు... ఈ గాలి గంధాలు..

సోకేను నా గుండెలో... సెగ లేని సయ్యాటలో..



అలా మండి పడకే జాబిలి..ఈ...ఈ.. 

చలి ఎండ కాసే రాతిరి..

దాహమైన వెన్నెల రేయి

దాయలేను ఇంతటి హాయి

ఎలా తెలుపుకోనూ ప్రేమని

ఎలా పిలుచుకోనూ రమ్మని


అలా మండి పడకే జాబిలి… చలి ఎండ కాసే రాతిరి




చరణం 2 :



పూటకొక్క తాపం... పూల మీద కోపం..

పులకరింతలాయే.. సందె గాలికి

చేదు తీపి పానం.. చెలిమి లోని అందం..

తెలుసుకుంది నేడే జన్మ జన్మకి


సముఖాన వున్నా రాయబారమాయే

చాటు మాటునేవో రాసలీలలాయే


ఈ ప్రేమ గండలు ఈ తేనె గుండాలు

గడిచేది ఎన్నాళ్ళకో... కలిసేది ఏనాటికో...


అలా మండి పడకే జాబిలి..ఈ...ఈ.. 

చలి ఎండ కాసే రాతిరి..

దాహమైన వెన్నెల రేయి

దాయలేను ఇంతటి హాయి

ఎలా తెలుపుకోనూ ప్రేమని

ఎలా పిలుచుకోనూ రమ్మని


అలా మండి పడకే జాబిలి… చలి ఎండ కాసే రాతిరి



No comments:

Post a Comment