Wednesday, June 26, 2013

నందామయా గురుడ నందామయా

చిత్రం: జీవనతరంగాలు (1973)
సంగీతం: జె.వి. రాఘవులు
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఎల్.ఆర్. ఈశ్వరి

పల్లవి:

ఊ...ఉహు...ఉ...
ఆ..అహ...హా...
లల..లలలా..లలల...లా..లల.లా...

నందామయా ...గురుడ నందామయా
ఉందామయా ...తెలుసుకుందామయా
నందామయా ...గురుడ నందామయా
ఉందామయా ...తెలుసుకుందామయా

చరణం 1:

మెరిసే సంఘం... మేడిపండు
దాని పొట్ట విప్పి చూస్తే... పురుగులుండు
మెరిసే సంఘం ...మేడిపండు
దాని పొట్ట విప్పి చూస్తే... పురుగులుండు

ఆ కుళ్ళు లేని చోటు ...ఇక్కడే
కుళ్ళు లేని చోటు ...ఇక్కడే ..అనుభవించు రాజా ఇప్పుడే...

ఆనంద సారం ఇంతేనయా...ఆనంద సారం ఇంతేనయా
ఆనంద సారం ఇంతేనయా...ఆనంద సారం ఇంతేనయా

నందామయా ...గురుడ నందామయా
ఉందామయా ...తెలుసుకుందామయా

చరణం 2:

పుట్టినప్పుడు బట్ట కట్టలేదు...పోయేటప్పుడు అది వెంట రాదు..
పుట్టినప్పుడు బట్ట కట్టలేదు...పోయేటప్పుడు అది వెంట రాదు..
నడుమ బట్ట కడితే నగుబాటు
నడుమ బట్ట కడితే నగుబాటు...నాగరీకం ముదిరితే పొరబాటు

వేదాంత సారం ఇంతేనయా...వేదాంత సారం ఇంతేనయా
వేదాంత సారం ఇంతేనయా...వేదాంత సారం ఇంతేనయా

నందామయా ...గురుడ నందామయా
ఉందామయా ...తెలుసుకుందామయా...
తెలుసుకుందామయా...తెలుసుకుందామయా
తెలుసుకుందామయా...తెలుసుకుందామయా...

No comments:

Post a Comment