Wednesday, July 17, 2013

రాధా అందించు నీ లేత పెదవి

చిత్రం: జేబు దొంగ (1975) 
సంగీతం: చక్రవర్తి 
గీతరచయిత: ఆరుద్ర 
నేపధ్య గానం: బాలు, సుశీల 

పల్లవి: 

రాధా.. అందించు నీ లేత పెదవి
ఏహే..లాలించు తీరాలి తనివి 

గోపీ నాలోని అందాలు నీవి 
ఓహో.. నీ రాగ బంధాలు నావి 

సరే..పదా..ఇటూ.. 
మనసు పొంగినది..మధువులూరినవి.. 
మమత గుండెలో.. నిండి పోయినవి 

రాధా.. అందించు నీ లేత పెదవి 
గోపీ.. నాలోని అందాలు నీవి 

చరణం 1: 

చెంపల్లోనా కెంపులున్నవి..ఒంపుల్లోనా వలపులున్నవి 
ఇంపు సొంపు మధుర మధురమాయే 
చెంపల్లోనా కెంపులున్నవి..ఒంపుల్లోనా వలపులున్నవి 
ఇంపు సొంపు మధుర మధురమాయే 

నీ పేరే తియ్యనైనది..నీ రూపే కమ్మనైనది 
నీ మనసే చల్లనైనది..నీ తోడే వెచ్చనైనది 

హే...సొగసు ఉయ్యాలలూగిందీ 
ఓ ఓ.. వయసు వయ్యార మొలికిందీ 

రాధా..నాలోని అందాలు నీవి 
గోపీ..అందించు నీ లేత పెదవి 

చరణం 2: 

మేను మేను వీణలైనవి..మెల్లగ చేతులు మీటుతున్నవి 
ఏదో గానం మోగుతున్నదోయి 
మేను మేను వీణలైనవి..మెల్లగ చేతులు మీటుతున్నవి 
ఏదో గానం మోగుతున్నదోయి 

చెలరేగే చిలిపి ఊహలు..పులకించే పడుచు గుండెలు 
చిగురించే కొత్త ఆశలు..పెనవేసే రెండు తనువులు 

ఓ ఓ..వలపు కెరటాల మునగాలి 
ఆహా..మధుర ప్రణయాల తేలాలి 

రాధా.. అందించు నీ లేత పెదవి 
గోపీ.. నాలోని అందాలు నీవి 
సరే..పదా..ఇటు.. 
మనసు పొంగినది..మధువులూరినవి 
మమత గుండెలో..నిండి పోయినది 

రాధా..నాలోని అందాలు నీవి 
గోపీ..అందించు నీ లేత పెదవి 

రాధా...గోపీ...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5301

No comments:

Post a Comment