Wednesday, July 24, 2013

సెలయేటి గలగల

చిత్రం: తులసి (1974)

సంగీతం: ఘంటసాల

గీతరచయిత: ఆరుద్ర

నేపధ్య గానం: బాలు, సుశీల





పల్లవి:



లలలలాలలలా...అహా...

లలలలాలలలా...అహా...

అహహహా...హా..అహహహా...హా...

సెలయేటి గలగల... ఆ... 

చిరుగాలి కిలకిల..ఆ.. 

సెలయేటి గలగల... చిరుగాలి కిలకిల....

సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిల మిలా...

చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళా.....



చరణం 1:



చందమామ కన్న నీ చెలిమి చల్లన

సన్నజాజి కన్న నీ మనసు తెల్లనా...


నిన్ను కౌగిలించ గుండే ఝల్లనా...ఆ..ఆ..

నిన్ను కౌగిలించ గుండే ఝల్లనా...నిలువెల్ల పులకించె మెల్లమెల్లనా....


సెలయేటి గలగల...ఆ...

చిరుగాలి కిలకిల..ఆ...

సెలయేటి గలగల.....చిరుగాలి కిలకిల....


సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిలమిలా...

చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళా..


చరణం 2:



పసి నిమ్మపండు కన్న నీవు పచ్చనా

ఫలియించిన మన వలపే వెచ్చవెచ్చనా...


అనురాగం ఏదేదో అమరభావనా...ఆ...

అనురాగం ఏదేదో అమరభావనా....ఆ...

అది నీవు దయచేసిన గొప్ప దీవెనా....


సెలయేటి గలగల...ఆ...

చిరుగాలి కిలకిల..ఆ...

సెలయేటి గలగల.....చిరుగాలి కిలకిల....


సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిలమిలా...

చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతలా....


అహా......అ.. .అహా...

అహహహా...హా..అహహహా...హా...




1 comment: