Tuesday, July 30, 2013

ఎవ్వడికోసం ఎవడున్నాడు

చిత్రం: ధర్మదాత (1970)
సంగీతం: టి. చలపతిరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

ఎవ్వడికోసం ఎవడున్నాడు పోండిరా... పోండి
నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా... రండి
నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా... రండి
ఎవ్వడికోసం ఎవడున్నాడు పోండిరా... పోండి

చరణం 1:

ఉన్నవాడిదే రాజ్యమురా...లేని వాడి పని పూజ్యమురా
మనుషులలోనా మమతలు లేవు...మంచితనానికి రోజులు కావు
మనుషులలోనా మమతలు లేవు...మంచితనానికి రోజులు కావు
అంతా స్వార్ధం... జగమంతా స్వార్ధం

ఎవ్వడికోసం ఎవడున్నాడు పోండిరా... పోండి
నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా... రండి
ఎవ్వడికోసం ఎవడున్నాడు పోండిరా... పోండి

చరణం 2:

ఒకడికి నే తలవంచనురా...బానిసగా జీవించనురా
మిన్ను విరిగి పై పడినా కాని...అవమానాన్ని సహించనురా

ఒరే ..ఉంటే వేళకింత తింటారా...లేకుంటే పస్తులుంటా..ఒరే..ఒరే...
మిమ్ము నమ్ముకోని పుట్టానా...మీరు ఉద్దరింతురనుకొన్నానా
మిమ్ము నమ్ముకోని పుట్టానా...మీరు ఉద్దరింతురనుకొన్నానా
పోతున్నారా.... వెళ్ళిపోతున్నారా

ఎవ్వడికోసం ఎవడున్నాడు పోండిరా... పోండి
నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా... రండి
ఎవ్వడికోసం ఎవడున్నాడు పోండిరా... పోండి

చరణం 3:

కాలం మారక పోతుందా...కష్టం తీరక పోతుందా
అదృష్టమన్నది ఇంటికి వచ్చి...తలుపులు తట్టక పోతుందా

అప్పుడు మీరేమంటారు...
మా నాన్నే..మా నాన్నే...మా బాబే అంటూ
నీడకు చేరే పక్షుల్లాగా...బెల్లం చుట్టూ ఈగల్లాగా
నీడకు చేరే పక్షుల్లాగా...బెల్లం చుట్టూ ఈగల్లాగా
మూగకపోరు ...నే చూడకపోను

ఎవ్వడి కోసం ఎవడున్నాడు పోండిరా... పోండి
నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా...రండి
నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా ...రండి

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1204

No comments:

Post a Comment