Thursday, July 25, 2013

వెన్నెల వేళ మల్లెల నీడ

చిత్రం: దీపారాధన (1980)
సంగీతం: చక్రవర్తి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

వెన్నెల వేళ మల్లెల నీడ
విందు ఉందని పిలిచింది చందమామా
విందు ఉందని పిలిచింది చందమామా
వెళ్ళనా... మాననా.. వెళ్ళనా.. మాననా

వెన్నెల వేళ .. మల్లెల నీడ
వెన్నెల వేళ మల్లెల నీడ
విందు ఉందని పిలిచాడు అందగాడు
విందు ఉందని పిలిచాడు అందగాడు
వెళ్ళనా.. మాననా.. వెళ్ళనా.. మాననా

చరణం 1:

చుక్కలు వచ్చాయి.. నిను చూడాలనీ..
ఆయ్..పువ్వులు వచ్చాయి.. మాటాడాలనీ
వెన్నెల వచ్చిందీ.. వేడిని దించాలనీ
చిరుగాలులు వచ్చాయీ.. నీపై నియ్యాలనీ
ఒంటరిగా ఉంటావు గంటైనా ఉందాము
అనుకొని వచ్చాను ఓయమ్మా.. ప్రాణం తీశావు మాయమ్మా... ఆ ఆ ఆ
అనుకొని వచ్చాను ఓయమ్మా.. ప్రాణం తీశావు మాయమ్మా

వెన్నెల వేళ.. మల్లెల నీడ

చరణం 2:

కన్నులు అదిరాయి.. సిగ్గులు నింపాలని
పెదవులు కదిలాయి..ముద్దివ్వాలని
కన్నులు అదిరాయి.. సిగ్గులు నింపాలని
హాఁ పెదవులు కదిలాయి..ముద్దివ్వాలని
బుగ్గలు బెదిరాయి.. ముడుపే కావాలని
చిరు చెమటలు పట్టాయి.. మనమొకటవ్వాలని
ప్రేమంటే ఏమంది పెళ్ళే తన మనసన్న..
అనుకున్నప్పుడు హాయిగా ఉందమ్మా
ఎదురుగ ఉంటే అడుగే పడదమ్మా

వెన్నెల వేళ మల్లెల నీడ
విందు ఉందని పిలిచింది చందమామా
విందు ఉందని పిలిచాడు అందగాడు
వెళ్ళనా.. మాననా.. వెళ్ళనా.. మాననా

No comments:

Post a Comment