Tuesday, July 23, 2013

ఇంతందంగా ఉన్నావే

చిత్రం: డాన్ (2007) 
సంగీతం: లారెన్స్ 
గీతరచయిత: చిన్ని చరణ్ 
నేపధ్య గానం: హరీష్ రాఘవేంద్ర 

పల్లవి: 

ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు 
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు 
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు 
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు 
నా కన్నుల్లోన నీ రూపం 
నాకన్న ఎంతో అపురూపం 
అనిపించే చిన్నారి....ఈ అనుభూతే నాకు తొలిసారి 


ఇంతందంగా.... 

చరణం 1: 

నిన్ను చూస్తే నిన్న లేని చలనం నాలోన..నాలోన 
కన్ను మూస్తే నిన్ను కలిసే కలలే ఓ లలనా 
ఎందుకో నా గుండెలోన ఏదో హైరానా.... హైరానా 
ఎంతమంది ఎదుట ఉన్న ఒంటరినవుతున్న 
ఈ అల్లరి నీదేనా నన్ను అల్లిన తిల్లనా 
అనుకున్నాన మరి నాలోనా 
ఈ నమ్మని కమ్మని క మొదలౌనని 
అందం.... అందం. 

ఇంతందంగ.... 

చరణం 2: 

మెరుపులాంటి సొగసులెన్నో నన్నే చూస్తున్నా.. చూస్తున్నా 
నేను మాత్రం నిన్ను చూస్తూ కలవరపడుతున్నా 
ఊహలన్నీ వాస్తవాలై నీలా మారేనా.. మారేనా 
ఊపిరేదో రూపమైతే అది నీవే మైనా 
ఆ దైవం ఎదురైనా ఈ భావం నిలిపేనా 
అనుకున్నానా మరి నాలోనా 
ఈ నమ్మని కమ్మని కథ మొదలౌనని 
అందం.... అందం.

No comments:

Post a Comment