Thursday, July 25, 2013

బొమ్మను చేసి ప్రాణము పోసి

చిత్రం: దేవత (1965)
సంగీతం: కోదండపాణి
గీతరచయిత: వీటూరి
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

బ్రతుకంతా బాధగా ... కలలోని గాధగా
కన్నీటి ధారగా.. కరగిపోయే
తలచేది జరుగదు... జరిగేది తెలియదు

బొమ్మను చేసి ప్రాణము పోసి.. ఆడేవు నీకిది వేడుకా
బొమ్మను చేసి ప్రాణము పోసి.. ఆడేవు నీకిది వేడుకా
గారడి చేసి గుండెను కోసి.. నవ్వేవు ఈ వింత చాలిక..
బొమ్మను చేసి ప్రాణము పోసి.. ఆడేవు నీకిది వేడుకా

చరణం 1:

అందాలు సృష్టించినావు దయతో నీవు.. మరలా నీ చేతితో నీవె తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావే.. గాఢాంధకారాన విడిచేవులే
కొండంత ఆశ అడియాస చేసి... పాతాళలోకాన త్రోసేవులే..
కొండంత ఆశ అడియాస చేసి... పాతాళలోకాన త్రోసేవులే..
బొమ్మను చేసి ప్రాణము పోసి.. ఆడేవు నీకిది వేడుకా

చరణం 2:

ఒకనాటి ఉద్యానవనము నేడు కనుము.. అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
అనురాగ మధువు అందించి నీవు.. హాలాహలజ్వాల చేసేవులే
ఆనందనౌక పయనించు వేళ... శోకాల సంద్రాన ముంచేవులే ..
బొమ్మను చేసి ప్రాణము పోసి.. ఆడేవు నీకిది వేడుకా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=80

No comments:

Post a Comment